Whats Today : నట దిగ్గజం చంద్రమోహన్ అంత్యక్రియలు.. ఐటీ రైడ్స్ కలకలం
Whats Today : తెలుగు చిత్రసీమలోని గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న చంద్రమోహన్ అంత్యక్రియలు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయి.
- Author : Pasha
Date : 13-11-2023 - 8:26 IST
Published By : Hashtagu Telugu Desk
Whats Today : తెలుగు చిత్రసీమలోని గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న చంద్రమోహన్ అంత్యక్రియలు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయి. చంద్రమోహన్ నివాసం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్రను చేపట్టనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ టీడీపీ – జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం. ఉమ్మడి మేనిఫెస్టోపై రెండు పార్టీల కీలక కసరత్తు.
- ఇవాళ తెలంగాణ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ఈనెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది.
- ఈరోజు సీఎం కేసీఆర్ అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, నర్సంపేటలో పర్యటిస్తారు.
- ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో ప్రముఖ ఫార్మా కంపెనీపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. నగరవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో రైడ్స్ జరుగుతున్నాయని సమాచారం. సదరు ఫార్మా కంపెనీ యజమాని ఇళ్లు, ఆఫీసులతో పాటు కంపెనీ సీఈవో, డైరెక్టర్‌ల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయట.
- తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం లభిస్తోంది.
- తిరుమల తిరుపతి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఇవాళ ఉదయం పద్మావతి అమ్మవారు కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Also Read: Showering – Hair : అది రాలిపోతుంది.. తలస్నానం టైంలో ఇలా చేయొద్దు