Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా వెనుక కారణం ఏంటి..?
Telangana Cabinet Meeting : నేడు శుక్రవారం జూలై 26న మంత్రివర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. అది అనూహ్యంగా వాయిదా పడడం చర్చనీయాంశంగా మారింది
- By Sudheer Published Date - 10:59 AM, Fri - 25 July 25

తెలంగాణ రాష్ట్రంలో జరుగాల్సిన కీలకమైన కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meeting) వాయిదా పడింది. నేడు శుక్రవారం జూలై 26న మంత్రివర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. అది అనూహ్యంగా వాయిదా పడడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పలు కీలక నిర్ణయాలపై చర్చించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం జరగాల్సి ఉండగా, కొన్ని ఆర్గనైజేషనల్ కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా వేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం జూలై 28న మధ్యాహ్నం 2 గంటలకు కొత్త సమయాన్ని నిర్ణయించారు.
ఈ వాయిదాకు ముఖ్యమైన కారణం.. మంత్రుల అందుబాటులో లేకపోవడమే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. వారు AICC (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఓబీసీ మీటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లారు. పార్టీ కార్యక్రమం కావడంతో, వారంతా ఢిల్లీ పర్యటనలో ఉండటంతో, రాష్ట్రస్థాయిలో కేబినెట్ నిర్వహణకు అవసరమైన సభ్యుల సంఖ్య అందుబాటులో లేకపోయింది.
Gold Price : శ్రావణమాసం రోజున భారీగా తగ్గిన బంగారం ధరలు
ఓబీసీ సమావేశానికి మూడు రాష్ట్రాల నుండి ముఖ్యమైన నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ముగ్గురు మంత్రులు ఆ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ వర్గాల మద్దతు పెంచే విధానాలపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ మీటింగ్ సందర్భంగా ఢిల్లీలోని పలు కీలక నేతలతో సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఆయన కేంద్ర స్థాయిలో రాష్ట్రానికి కావలసిన నిధుల విషయంలో చర్చలు జరిపినట్లు సమాచారం.
ఇక తెలంగాణకు తిరిగి వచ్చిన అనంతరం తదుపరి కేబినెట్ సమావేశాన్ని జూలై 28న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా వ్యవసాయరుణాల మాఫీ, గిరిజన భూముల హక్కులు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, విద్యుత్ సబ్సిడీ, డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ పథకం అమలు వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. కాబట్టి ఈ కేబినెట్ సమావేశంపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.