HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >What Is Going To Be Built At Bapu Ghat In Hyderabad

Bapu Ghat : బాపూఘాట్‌ వద్ద అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం, వీల్‌ ఆఫ్‌ లైఫ్‌

బాపూ ఘాట్‌(Bapu Ghat) వద్ద మూసీ ప్రాంత అభివృద్ధి కోసం 222.27 ఎకరాల రక్షణ శాఖ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఇటీవలే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను  సీఎం రేవంత్ కోరారు.

  • Author : Pasha Date : 01-12-2024 - 9:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Bapu Ghat gandhi Statue Of Peace Isa River Musi River

Bapu Ghat : హైదరాబాద్‌లోని ‘బాపూ ఘాట్‌’‌ వద్దనున్న మూసీ నది పరివాహక ప్రాంతాన్ని  అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంపై సీఎం రేవంత్ సర్కారు ఫోకస్ పెట్టింది. గోదావరి నది నుంచి మళ్లించే నీటితో పాటు మూసీ, ఈసీ నదుల నీరు బాపూ ఘాట్‌ వద్ద కలుస్తుంది. అందుకే దీన్ని త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. బాపూ ఘాట్‌(Bapu Ghat) వద్ద మూసీ ప్రాంత అభివృద్ధి కోసం 222.27 ఎకరాల రక్షణ శాఖ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఇటీవలే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను  సీఎం రేవంత్ కోరారు. త్వరలోనే  ఆ భూములను రాష్ట్ర సర్కారుకు అప్పగిస్తారని తెలుస్తోంది. బాపూ ఘాట్‌ వద్ద వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన 34 ఎకరాల భూమి ఉంది. 40 ఎకరాల దాకా పట్టా భూమిని సేకరించాల్సి ఉంది.  బాపూ ఘాట్‌ వద్ద, ఘాట్‌ నుంచి ఎగువ ప్రాంతాల్లో భూసేకరణ కోసం రూ.800 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. అందుకే బాపూ ఘాట్‌ వరకు ఒక సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను, ఎగువన ఇంకో డీపీఆర్‌ను వేర్వేరుగా తయారు చేయనున్నారు.

Also Read :Eturnagaram Encounter : ఏటూరునాగారం అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

ఇక బాపూ ఘాట్‌ వద్ద జరగనున్న నిర్మాణాల విషయానికి వస్తే..  300 అడుగుల ఎత్తు కలిగిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తారు. అతిపెద్ద వీల్‌ ఆఫ్‌ లైఫ్‌ ఏర్పాటవుతుంది. సింగపూర్‌లోని ప్లైయర్‌ జెయింట్‌ వీల్‌ ఎత్తు 165 మీటర్లు. దుబాయ్‌‌లోని ఐ జెయింట్‌ వీల్‌ ఎత్తు 250 మీటర్లు. మన హైదరాబాద్‌లో నిర్మించబోయే వీల్‌ ఆఫ్‌ లైఫ్‌ ఎత్తు వాటి కంటే ఎక్కువే ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. బాపూ ఘాట్ వద్ద ‘త్రికోణ’ పేరుతో అంతర్జాతీయ స్థాయి ధాన్య కేంద్రం ఏర్పాటవుతుంది. ట్రినిటీ పేరుతో వెల్‌నెస్‌ విలేజ్‌ను నిర్మిస్తారు. బ్రిడ్జ్‌ ఆఫ్‌ రికవరీ, బ్రిడ్జి ఆఫ్‌ డిస్కవరీలను కూడా నిర్మిస్తారు. త్వరలోనే ఈ ప్రతిపాదిత నిర్మాణాల వివరాలతో డీపీఆర్‌ రెడీ అవుతుంది. బాపూ ఘాట్ పరిధిలో ఏయే చోట ఏయే నిర్మాణాలు జరుగుతాయనే సమాచారాన్ని అందులో ప్రస్తావించనున్నారు.

Also Read :Vijay Sethupathi : చైనాలో విజయ్ సేతుపతి మహారాజా కలెక్షన్ల దూకుడు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bapu Ghat
  • Gandhi Statue of Peace
  • hyderabad
  • Isa river
  • Musi river

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

  • LPL Financial opens first GCC outside US in Hyderabad

    హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

Latest News

  • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

  • Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd