NIMS : నిమ్స్ హాస్పటల్ అగ్ని ప్రమాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఏమన్నారంటే !
NIMS : మంటలు పెద్దగా వ్యాపించకపోవడం అనేది ఊరట విషయమని, ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఆయన తెలిపారు. ఆస్తినష్టం కూడా స్వల్పంగానే జరిగిందన్నారు
- Author : Sudheer
Date : 19-04-2025 - 8:45 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్ ఐదో అంతస్తులో మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలో కలకలం రేగింది. మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించే ప్రమాదం ఉండడం తో, అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Firefighters) మంటలను వేగంగా అదుపు చేయడంలో విజయం సాధించారు.
Kasireddy Rajasekhar Reddy : లిక్కర్ స్కాం కేసు.. ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మంటలు ఎగిసిపడటంతో రోగులు, వారి సహాయకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆసుపత్రి భవనంలో పొగలు కమ్ముకోవడంతో కొంతసేపు రోగులు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సిబ్బంది చురుకైన చర్యలతో రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అప్రమత్తంగా వ్యవహరించిన నిమ్స్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘనంగా ప్రశంసలందుకుంటున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) స్పందించారు. మంటలు పెద్దగా వ్యాపించకపోవడం అనేది ఊరట విషయమని, ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఆయన తెలిపారు. ఆస్తినష్టం కూడా స్వల్పంగానే జరిగిందన్నారు. నిమ్స్ డైరెక్టర్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. వేసవి కాలంలో అగ్నిప్రమాదాల అవకాశం ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.