The World Economic Forum : సీఎం రేవంత్ పై ప్రశంసల జల్లు
The World Economic Forum : రాష్ట్ర ప్రగతికి సంబంధించి రేవంత్ రెడ్డి రూపొందించిన విధానాలు బలమైన ప్రణాళికలుగా ఉన్నాయని WEF తన లేఖలో స్పష్టం చేసింది
- Author : Sudheer
Date : 07-02-2025 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) ప్రశంసలు కురిపించింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి దిశలో ఆయన తీసుకుంటున్న చర్యలు ఎంతో దార్శనికంగా ఉన్నాయని పేర్కొంటూ ఓ లేఖను విడుదల చేసింది. దావోస్‌లో నిర్వహించిన ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొని తెలంగాణ అభివృద్ధిపై విశ్లేషణాత్మకంగా చర్చించడాన్ని ఫోరం ప్రశంసించింది. రాష్ట్ర ప్రగతికి సంబంధించి రేవంత్ రెడ్డి రూపొందించిన విధానాలు బలమైన ప్రణాళికలుగా ఉన్నాయని WEF తన లేఖలో స్పష్టం చేసింది. ముఖ్యంగా, “రైజింగ్ తెలంగాణ 2050” అనే నినాదం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీని ద్వారా రాష్ట్రం ముందుకు సాగే మార్గాన్ని స్పష్టంగా ప్రదర్శించారని ఫోరం అభిప్రాయపడింది.
Repo Rate: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. తగ్గనున్న లోన్ ఈఎంఐలు!
2047 కల్లా హైదరాబాదును కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నెట్-జీరో లక్ష్యం గొప్ప సంకల్పమని ఫోరం తన లేఖలో పేర్కొంది. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచేలా ఉందని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ, పట్టణాభివృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసించింది. దావోస్ సదస్సులో తెలంగాణ ఆకర్షణీయ రాష్ట్రంగా నిలిచిందని, పెట్టుబడుల రాబడి పెంచే విధంగా రేవంత్ రెడ్డి చేపట్టిన చర్చలు సమర్థవంతంగా ఉన్నాయని WEF పేర్కొంది. గ్లోబల్ కంపెనీలను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడింది.