TS : సీఎం కేసీఆర్ కాన్వాయ్ అడ్డుకున్న VRAలు…కాన్వాయ్ ఆపి వారికి…!!
వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కు అక్కడ నిరసన సెగ తగలింది. సీఎం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు VRAలు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.
- By hashtagu Published Date - 04:50 PM, Sat - 1 October 22

వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కు అక్కడ నిరసన సెగ తగలింది. సీఎం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు VRAలు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. దీంతో నిరసన కారులను పోలీసులు అడ్డుకోవడంతో…ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది గమనించిన సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను ఆపి…వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాగా వరంగల్ పర్యటనలో కేంద్రంపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. వరంగల్‌లో ప్రతిమ క్యాన్సర్ ఆసుపత్రిని సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ తలసరి ఆదాయం ముంబై కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాము చెప్పిన మాటలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేటాయించలేదని కేసీఆర్ ఆరోపించారు. గత ఎనిమిదేళ్లలో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, త్వరలోనే రాష్ట్రంలోని 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు తెస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటించి విమర్శలు చేస్తున్నారని సీఎం విమర్శించారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయన్నారు. దేశాభివృద్ధి యువత చేతుల్లోనే ఉందని కేసీఆర్ అన్నారు.
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, రానున్న రోజుల్లో మరింత వెలుగులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో 33 వైద్య సంస్థల ఏర్పాటు ఆశయం రానున్న కాలంలో సాకారం కానుందన్న విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ వ్యక్తం చేయడంతో రాష్ట్రంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకున్నారని కేసీఆర్ తెలిపారు.