HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Vivek Venkataswamy Resign Bjp

Vivek Venkataswamy : బీజేపీకి వివేక్ రాజీనామా..కాసేపట్లో రాహుల్ తో భేటీ

మాజీ MP వివేక్ వెంకటస్వామి బిజెపి పార్టీ కి రాజీనామా చేసారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు అధికారిక ప్రకటన చేసారు.

  • Author : Sudheer Date : 01-11-2023 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vivek Cong
Vivek Cong

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి పార్టీ (BJP) కి భారీ షాక్ తగిలింది. మాజీ MP వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) బిజెపి పార్టీ కి రాజీనామా చేసారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు అధికారిక ప్రకటన చేసారు. ఈమేరకు రిజైన్ లెటర్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి పంపించారు. ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాసేపట్లో వివేక్ వెంకట స్వామి నోవా టెల్ హోటల్ కు వెళ్లి రాహుల్ గాంధీ తో భేటీ కాబోతున్నారు.

భారమైన హృదయంతో నేను రాజీనామా చేస్తున్నాను..ఇంతకాలం పార్టీలో తనకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు అని చెబుతూ లేఖలో ప్రస్తావించారు. అయితే కొద్దిరోజుల క్రితమే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వివేక్ వెంకటస్వామితో భేటీ అయ్యారు. వివేక్‌ని కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వనించారు. అయితే వివేక్ వెంకటస్వామితో పాటు ఆయన కుమారుడు వంశీకి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు రెడీ ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

వివేక్ తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 2009లో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్ బొగ్గు మరియు ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2 జూన్‌ 2013న కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ (TRS) పార్టీలో చేరాడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31న తిరిగి కాంగ్రెస్‌లో చేరాడు. ఆయన 2014లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 2016లో టీఆర్‌ఎస్‌ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితుడయ్యాడు.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి 25 మార్చి 2019న రాజీనామా చేసి బిజెపి లో చేరారు. అప్పటి నుండి నేటి వరకు బీజేపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక ఇప్పుడు సొంత గూటికి చేరబోతున్నారు.

Read Also : Congress Candidates : కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం.. బిఆర్ఎస్ కు కలిసొస్తుందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • vivek venkataswamy
  • Vivek Venkataswamy Resign BJP

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

  • Bigshock

    TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

Latest News

  • అంబాజీ మాత ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.50 కోట్ల భారీ విరాళం

  • అకౌంట్ బ్యాన్ అయినప్పటికీ అన్వేష్ తలపొగరు ఏమాత్రం తగ్గలేదు..బత్తాయిలకు నరకం చూపిస్తాను అంటూ కామెంట్స్

  • Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Trump Warning : ట్రంప్ వార్నింగ్ తో మార్కెట్ షేక్.. $100 దిశగా ఆయిల్ ధరలు?

  • India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

Trending News

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd