Vijay Shanthi : బిజెపికి విజయశాంతి రాజీనామా
- By Sudheer Published Date - 10:11 PM, Wed - 15 November 23

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి పార్టీ (BJP) కి భారీ షాక్ తగిలింది. పార్టీ కి విజయశాంతి (Vijay Shanthi ) రాజీనామా (Resign) చేసారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy)కి పంపారు. గత కొంత కాలంగా బిజెపి పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారు. విజయశాంతి విషయంలో బిజెపి పలుమార్లు మాట తప్పింది.టికెట్ విషయంలోనే కాక, బిజెపి క్యాంపెయినర్ విషయంలో కూడా నిరాశకు గురి చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ముందుగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై బిజెపి అభ్యర్థి అని ప్రచారం చేసారు..ఆ తర్వాత పార్టీ స్టార్ క్యాంపెయినర్ అన్నారు…కానీ చివరికి వచ్చేసరికి అటు అభ్యర్థిగానే కాదు ఇటు క్యాంపెయినర్ గానూ ఆమెకు అవకాశం దక్కలేదు. ఇలా పలుసార్లు అనుమానాలకు గురిచేయడం… పార్టీలోకూడా తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో విజయశాంతి తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వినికిడి.
Read Also : Congress Rebels Withdraw Nominations : కాంగ్రెస్ కు పెద్ద గండం తప్పింది..