Vice President : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
- Author : Prasad
Date : 31-07-2022 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. పిల్లల్లో దృఢమైన నైతికతను పెంపొందించాలని, జాతీయ విలువలైన ఏకత్వం, సామరస్యం, సార్వత్రిక సౌభ్రాతృత్వాన్ని చిన్నప్పటి నుంచే పెంపొందించాలని ఆయన అన్నారు.
మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా కూడా వివక్ష చూపని భారతదేశాన్ని చూడాలన్నారు. పాఠశాలల్లో మాతృభాషను ఉపయోగించాలనే అంశాన్ని స్పృశిస్తూ, కొన్ని పాఠశాలలు విద్యార్థుల మాతృభాషను చిన్నచూపు చూస్తాయని.. వారిని ఆంగ్లంలో ప్రత్యేకంగా మాట్లాడేలా నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నాయని వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరి మాతృభాషలో నేర్చుకోవడం, స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేయడం విద్యా ఫలితాలను మెరుగుపరచడమే కాకుండ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందన్నారు.
జాతీయ విద్యా విధానం యొక్క సిఫార్సులను ప్రస్తావిస్తూ, ఉపరాష్ట్రపతి ప్రాథమిక స్థాయిలో బోధనా మాధ్యమాన్ని మాతృభాషలకు మార్చాలని మరియు దానిని క్రమంగా ఉన్నత స్థాయిలకు కూడా విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, శాసనసభ సభ్యుడు బి. సుభాష్ రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యాశాఖ & ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వాకాటి కరుణ, యాజమాన్యం, సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.