Chennamaneni Hot Comments : ఆ సమస్యను పరిష్కరించకపోతే తిరగబడతా.. ఎమ్మెల్యే చెన్నమనేని వార్నింగ్
Chennamaneni Hot Comments : మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలపై ఇన్నాళ్లూ సున్నితంగా మాట్లాడిన వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు.. ఇప్పుడు గొంతును సవరించుకొని గర్జించారు.
- By Pasha Published Date - 01:31 PM, Sun - 8 October 23

Chennamaneni Hot Comments : మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలపై ఇన్నాళ్లూ సున్నితంగా మాట్లాడిన వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు.. ఇప్పుడు గొంతును సవరించుకొని గర్జించారు. ముంపు గ్రామాల సమస్యలపై తెలంగాణ సర్కారు పరిష్కారాన్ని చూపకపోతే తానే తిరగబడతానని ప్రకటించారు. ముంపు గ్రామాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండి ఉంటే.. వాటి సమస్యలు ఎన్నడో పరిష్కారమై ఉండేవన్నారు. ఈవిషయాన్ని తాను గతంలోనే సూటిగా మంత్రి కేటీఆర్ కు చెప్పానని పేర్కొన్నారు. ముంపు గ్రామాల సమస్యలపై తాను అసెంబ్లీలో అధికార పక్షంలాగా కాకుండా.. ఓ ప్రతిపక్ష నేతలాగా పోరాటం చేశానని చెప్పారు. తాను మంత్రిని అయి ఉంటే.. మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు సమస్యను తీర్చేవాడినని వ్యాఖ్యానించారు. వేములవాడ అర్బన్ మండలం అణుపురంలో వేములవాడ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ కొత్త అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. చెన్నమనేని రమేష్ బాబు ఈ కామెంట్స్ చేయడం రాజకీయ కలకలం క్రియేట్ చేసింది. ఆయన వ్యాఖ్యలు విని అక్కడున్న బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావు, ఇతర సీనియర్ నేతలు షాక్ కు గురయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం నేను ఎక్కని గడప లేదు. దిగని గడప లేదు. కలవని అధికారి లేడు. కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశాను’’ అని చెన్నమనేని రమేష్ బాబు ఈసందర్భంగా పేర్కొన్నారు. ‘‘నేను చెన్నమనేని రాజేశ్వరరావు కూమారుడిని కాబట్టి.. ఆత్మగౌరవం వల్ల ఆ కాళ్లు పట్టుకొనే పని చేయలేదు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ పోరాటం చేస్తా’’ అని స్పష్టం చేశారు. మిడ్ మానేరు ముంపు నిర్వాసితుల సమస్యల నుంచి పాఠాలు నేర్చుకోవాలని తమ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు సూచించారు. వేములవాడ అసెంబ్లీ టికెట్ ను చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు ఇచ్చిన కేసీఆర్.. చెన్నమనేని రమేష్ బాబుకు ముఖ్యమంత్రి వ్యవసాయ సలహాదారు పోస్టును (Chennamaneni Hot Comments) కట్టబెట్టారు. చెన్నమనేని, చల్మెడ మధ్య సయోధ్య కుదిరిందని అంతా భావించిన వేళ.. రమేష్ బాబు కామెంట్స్ తో వేములవాడలో రాజకీయ కలకలం మళ్లీ మొదలైంది.