HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Telangana
  • ⁄Vamshi Elevation A Step To Check Revanth

ఢిల్లీలో రేవంత్‌కి చెక్‌.. మ‌రో యువ‌నేత‌కు కీల‌క బాధ్య‌త‌లు

అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న రేవంత్‌రెడ్డి గ్రాఫ్‌పై కొంత‌మంది క‌న్నుప‌డిందా? మ‌రో కీల‌క తెలంగాణ యువ‌నేత‌కు ఏఐసీసీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డం వెనుక ఎవ‌రి హ‌స్తం ఉంది? చ‌ద‌వండి..

  • By Hashtag U Published Date - 01:11 PM, Wed - 27 October 21
  • daily-hunt
ఢిల్లీలో రేవంత్‌కి చెక్‌.. మ‌రో యువ‌నేత‌కు కీల‌క బాధ్య‌త‌లు

ఢిల్లీ.. రేవంత్‌రెడ్డి. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి అధఃపాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. సోష‌ల్‌మీడియా ఎలివేష‌న్స్ ఒక‌వైపు.. రేవంత్ దూకుడు మ‌రోవైపు వెర‌సి ఇన్నాళ్లూ ప్ర‌శాంతంగా ఉన్న కేసీఆర్‌కు నిద్ర‌ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తున్నాయి. ఎంత‌గా అంటే మ‌ళ్లీ కేసీఆర్ యాక్టివ్ అవ్వ‌డాన్నిజ‌నం క్లియ‌ర్‌గా గ‌మ‌నించేంత‌గా..

రేవంత్ పీసీసీ అవ్వ‌డం వెనుక రాహుల్‌గాంధీ ప‌ర్స‌న‌ల్ ఇంట్ర‌స్ట్ ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. యువ‌నేత‌కు బాధ్య‌త‌లు అప్ప‌జెప్తే.. పార్టీ ప‌రుగులు పెడుతుంద‌న్న అభిప్రాయ‌మే కావ‌చ్చు కానీ.. ఏళ్ల నుంచి ప‌ద‌వి కోసం క‌ళ్లు కాయ‌లుకాసేలా ఎదురుచూసిన చాలామంది సీనియ‌ర్స్‌కి ఇది మింగుడుప‌డ‌లేదు. ఫ‌లితంగా పార్టీలో వ‌ర్గాలు త‌యార‌య్యాయి. కానీ.. ఇవేమీ ప‌ట్టించుకోకుండా రేవంత్ త‌న ప‌ని తాను చేసుకునిపోతున్నాడు.

 

అయితే, రేవంత్ దూకుడుకు, పార్టీలా కాకుండా సింగిల్‌మ్యాన్ ఎలివేష‌న్స్‌కు బ్రేక్ వేయ‌డానికి ఢిల్లీలో ఓ వ‌ర్గం పావులు క‌దుపుతోంద‌న్న‌ది వార్త‌. రాహుల్‌గాంధీ దీన్ని వ్య‌తిరేకిస్తున్నా కూడా డైర‌క్ట్ సోనియాతో ట‌చ్‌లో ఉండే కొంత‌మంది నేత‌లు ఇందుకు సంబంధించి గ‌ట్టిగా ట్రై చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌ధ్యంలో .. తెలంగాణ‌కు చెందిన మ‌రో కీల‌క యువ‌నాయ‌కుడికి ఏఐసీసీలో అతికీల‌క బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏఐసీసీ కార్యకర్త, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అనేత్రి సోనియా గాంధీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న వంశీచంద్ రెడ్డికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కి సహాయకుడిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.ఆయన గతంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగ నాయకుడిగా.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి నుంచే అధిష్టానం వద్ద గుర్తింపు పొందిన వంశీచంద్ తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శి సహాయకుడిగా నియమితులయ్యారు. అంటే.. ఇక‌పై రేవంత్ తీసుకునే ఏ నిర్ణ‌య‌మైనా వంశీచంద్ ద్వారానే హైక‌మాండ్‌కు వెళ్లాలి. వంశీచంద్‌రెడ్డికి ఈ స్ధాయి బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డం ఖ‌చ్చితంగా రేవంత్ రెడ్డికి చెక్ పెట్ట‌డానికే అని విశ్లేష‌కులు, కాంగ్రెస్ పార్టీ నేత‌లు భావిస్తున్నారు.

Tags  

  • aicc
  • challa vamshi chand reddy
  • sonia gandhi
  • tpcc chief revanth
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Congress contestants : నోటుకు టిక్కెట్ ! కాంగ్రెస్ అధిష్టానంకు ఫిర్యాదుల వెల్లువ‌!!

Congress contestants : నోటుకు టిక్కెట్ ! కాంగ్రెస్ అధిష్టానంకు ఫిర్యాదుల వెల్లువ‌!!

Congress contestants :  కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛకు అవ‌ధులుండ‌వ్.అదే ఆ పార్టీకి న‌ష్టం క‌లిగించేలా ఉంది.

  • Power of Congress  : తెలంగాణ‌లో `ఛాన్స్`పై రాహుల్ అస్త్రం

    Power of Congress : తెలంగాణ‌లో `ఛాన్స్`పై రాహుల్ అస్త్రం

  • Women Reservation Bill: పీవీ నరసింహారావు మృతదేహాన్ని పార్టీ ఆఫీసులోకి అనుమతించలేదు

    Women Reservation Bill: పీవీ నరసింహారావు మృతదేహాన్ని పార్టీ ఆఫీసులోకి అనుమతించలేదు

  • Women’s Reservation Bill : 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు..!

    Women’s Reservation Bill : 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు..!

  • Congress : తెలంగాణ‌లో ఇంటింటికి కాంగ్రెస్ నేత‌లు.. సిక్స్ గ్యారెంటీల‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ‌

    Congress : తెలంగాణ‌లో ఇంటింటికి కాంగ్రెస్ నేత‌లు.. సిక్స్ గ్యారెంటీల‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ‌

Latest News

  • Adi Parashakti: అత్యంత శక్తివంతమైన పరాశక్తి

  • Baby Feeding Milk Bottles : పిల్లల పాల బాటిల్స్‌ను ఎలా శుభ్రపరుచుకోవాలి?

  • DSC Protest: డీఎస్సీ అభ్యర్థుల నిరసనలో పాల్గొన్న ఎస్ఐఓ

  • Money : ఈ అలవాట్లు ఉంటే మన దగ్గర డబ్బు నిలవదు.. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకోండి..

  • Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణలా మహేష్ బాబు కూడా.. అలా ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నాడు..

Trending

    • Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మ‌సాక్షి లేటెస్ట్ స‌ర్వే వెల్ల‌డి!!

    • Snake Head Alive : చనిపోయాక కూడా పాము తల సజీవంగానే ఉంటుందా ?

    • Bhuloka To Yamaloka : భూలోకం టు యమలోకం .. ఆత్మల పయనం ఇలా..

    • Court Named Child : ఆ పాపకు కోర్టు పేరు పెట్టింది.. ఎందుకంటే ?

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version