Nirmala Sitharaman Reacts: ఆ విషయం ఆమెనే అడగండి!
అధికార బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- By Balu J Published Date - 08:47 PM, Fri - 2 September 22

అధికార బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు తెలంగాణలో శుక్రవారం పర్యటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ప్రమేయం ఉన్న మద్యం కుంభకోణం ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నలకు నిర్మలా స్పందించారు. నిర్మల తెలివిగా జవాబిస్తూ.. ఆ విషయం ఆరోపణలు వచ్చినవాళ్లనే అడగండి అంటూ బదులిచ్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని PDS స్థానాలను సందర్శించి, PDS కింద పంపిణీ చేయబడిన ప్రతి కిలో బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసే ఖర్చుల గురించి తెలుసుకున్నారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు కేంద్ర మంత్రి పర్యటించారు.