HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Union Governments Award For Mission Bhagiratha

Mission Bhagiratha: ‘మిషన్ భగీరథ’కు కేంద్ర ప్రభుత్వ అవార్డు!

మిషన్ భగీరథకు కేంద్రప్రభుత్వ అవార్డు ప్రకటించింది. ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది.

  • Author : Balu J Date : 29-09-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mission
Mission

మిషన్ భగీరథకు కేంద్రప్రభుత్వ అవార్డు ప్రకటించింది. ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా రక్షిత తాగు నీరు సరఫరా అవుతుంది. శుద్ధి చేసిన తాగు నీటిని ఇంటింటికీ నల్లా ద్వారా అందజేస్తూ “మిషన్ భగీరథ” దేశానికే ఆదర్శంగా నిలిచింది.

మిషన్ భగీరథ పథకం అమలు తీరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా పరిశీలించింది. తెలంగాణ వ్యాప్తంగా రాండమ్ గా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించింది. మిషన్ భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించింది.

మిషన్ భగీరథతో ప్రతీ రోజూ ఇంటింటికి నల్లాతో నాణ్యమైన తాగునీరు తలసరి 100 లీటర్లతో అందుతున్నట్టు గుర్తించింది. తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం నాణ్యత మరియు పరిమాణంలో ఇప్పటికే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న నిర్ణయానికి వచ్చింది. అన్ని గ్రామాలలో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా నిరాటంకంగా, ప్రతిరోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించబడింది. ఈ క్రమంలో ‘రెగ్యులారిటీ కేటగిరీ’ లో తెలంగాణ, దేశంలోనే నంబర్ వన్ గా గుర్తించి జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపిక చేసింది.

తాగు నీటి రంగంలో అద్భుతమైన, అనితరసాధ్యమైన పనితీరు కనపరుస్తూ మిషన్ భగీరథ దేశంలోనే ఆదర్శవంతంగా నిలచింది. అక్టోబరు 2 గాంధీ జయంతి నాడు ఢిల్లీలో అవార్డును అందుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణ ప్రగతిని గుర్తించి, మరో సారి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేసినందుకు, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.

Telangana’s flagship “Mission Bhagiratha” wins national award for providing safe drinking water to all rural households

Thanks for the recognition but it would be befitting if the NDA Govt can honour the recommendation of NITI Ayog to grant ₹19,000 Cr to this pioneering project https://t.co/hPFDuKwggE

— KTR (@KTRBRS) September 29, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mission Bhagirath
  • telangana government
  • Union Government award

Related News

Telangana Cheyutha Pension

రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రూ.4 వేల చేయూత పెన్షన్ పెంపు!

Telangana Government :  తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడనుంది. బోగస్ పింఛన్లను అరికట్టడం ద్వారా నిధులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పింఛనుదారులకు గుడ్‌న్యూస్ ఏప్రిల్ నుంచే ప

    Latest News

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd