HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ukraine Crisis Out Of Water Students Trapped In Sumy Forced To Collect Snow

Ukraine crisis: మా సంగతేంటి.. స్వదేశానికి తర్వగా తరలించండి!

పేలుళ్ల శబ్దాలు.. క్షిపణుల దాడులు.. తుపాకల మోతతో భారతీయ విద్యార్థులు భయపడిపోతున్నారు.

  • Author : Balu J Date : 05-03-2022 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ukrain
Ukrain

పేలుళ్ల శబ్దాలు.. క్షిపణుల దాడులు.. తుపాకల మోతతో భారతీయ విద్యార్థులు భయపడిపోతున్నారు. అయితే యుద్ధం కారణంగా వైద్య విద్యార్థుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేసేందుకు విద్యార్థులు తమ దాహం తీర్చుకునేందుకు మంచునీళ్లను తోడుకుంటున్న వీడియోలను గ్రూపుల్లో షేర్ చేశారు. అక్కడి యూనివర్సిటీ, బంకర్లలో ఉంటున్న విద్యార్థుల అవసరాల నిమిత్తం రెండు, మూడు వాటర్ ట్యాంక్ లు వచ్చాయి. అవి కేవలం తాగునీటికి కూడా సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తమ వసతి గృహంలోని టెర్రస్‌పై మంచు కరుగుతున్న పైపుల నుండి నీటిని ఎలా సేకరిస్తున్నారో చూపించే వీడియోలను షేర్ చేశారు. అపరిశుభ్రమైన నీటిని తాగడం తప్ప మరో మార్గం లేదని ఆందోళన తెలిపారు.

ఉక్రెయిన్ లోని సుమీ నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ శ్రీనాథ్ అనే విద్యార్థి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. “యూనివర్సిటీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మాకు తిండి లేదు. కరెంటు, నీళ్లు లేవు’’ అన్నారు. విద్యార్థులకు ఇంటర్నెట్‌ సమస్య కూడా ఎదురవుతోంది. బతకడం కష్టంగా మారిందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా సుమీలోని యూనివర్సిటీకి చెందిన హాస్టళ్లలో చిక్కుకున్న వందలాది మంది విద్యార్థుల పరిస్థితులు, వారు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను లను మహతాబ్ అనే విద్యార్థి వీడియోలు తీస్తూ వివరిస్తున్నాడు.

తెలంగాణకు చెందిన విద్యార్థి నిజాముద్దీన్ విద్యుత్, నీటి సరఫరాలో అంతరాయం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను తన కుటుంబానికి తెలియజేశాడు. “మా సంగతేమిటి? ఆహారం, నీరు, ప్రాథమిక అవసరాల కోసం ఎటువంటి వనరులు లేకుండా బంకర్లలో అసౌకర్యంగా రాత్రులు గడిపుతున్నాం. ఇకనైనా మా గురించి ఆలోచించండి? మేం ఇంటికి వెళ్ళే వరకు ఎన్ని పేలుళ్లు సంభవిస్తాయో తెలియదు’’ అని బోరుమంటున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt failed
  • Russia-Ukraine War
  • telangana students in ukraine

Related News

Russia Ukraine War

ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు

Russia Vs Ukraine War  యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై రష్యా డ్రోన్‌ దాడి జరిపింది. ఈ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా గని కార్మికులేనని అధికారులు గుర్తించారు. దాడికి గురైన బస్సు తమ సంస్థకు చెందినదేనని ఉక్రెయిన్‌లో అతిపెద్ద విద్యుత్‌

  • Scott Bessent

    భారత్‌తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. యూరప్‌ పై అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా

Latest News

  • విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్

  • కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్

  • మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !

  • మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

  • జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd