Congress : మల్కాజ్‌గిరి లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే – తుమ్మల
- Author : Sudheer
Date : 23-12-2023 - 3:33 IST
Published By : Hashtagu Telugu Desk
అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంఖా మోగించిన హస్తం పార్టీ (Congress)…త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) అదే విజయం సాధించాలని చూస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన చోట విజయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లు ఊరుతోంది. రీసెంట్ గా కాంగ్రెస్ అధిష్టానం 17 లోక్ సభలకు సంబదించిన ఇంచార్జ్ లను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికే మరోసారి ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. సీఎం రేవంత్ , ఉప ముఖ్యమంత్రి భట్టి చెరో రెండు నియోజకవర్గాలను చూసుకుంటున్నారు. ఇక మల్కాజ్ గిరి (Malkajgiri ) విషయానికి వస్తే మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala Nageswara Rao) ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కంటెస్టడ్ కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ విజయమే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే విషయాలపై చర్చించారు. అన్ని విధాలుగా తన పూర్తి సహకారం ఉంటుందని తుమ్మల హామీ ఇచ్చారు. స్థానికంగా ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలని, అందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
Read Also : CM Revanth Reddy : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ సమావేశం..