TSRTC Warning: ప్రజలకు సజ్జనార్ వార్నింగ్
తెలంగాణ ఆర్టీసీ ఆస్తులపై పోస్టర్స్ అతికించడం లేదా సంస్థకు చెందిన ప్రాంతాలను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని ఆర్టీసి అధికారులు తెలిపారు.
- By Hashtag U Published Date - 07:00 AM, Fri - 3 December 21
తెలంగాణ ఆర్టీసీ ఆస్తులపై పోస్టర్స్ అతికించడం లేదా సంస్థకు చెందిన ప్రాంతాలను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని ఆర్టీసి అధికారులు తెలిపారు. ఆర్టీసీ ఆఫీసు పరిసరాలను అపరిశుభ్రం చేయవద్దని, సంస్థ ఇచ్చిన నిమయాలు పాటించని వాళ్లపై కేసులు బుక్ చేస్తామని ఆర్టీసీ అధికారులు ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు.
ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ చట్టం సెక్షన్ 3 ప్రకారం ఆర్టీసీ ఆస్తులను డ్యామేజ్ చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని, దానితో పాటు అనుమతి లేకుండా ఆర్టీసీ ప్రాపర్టీస్ పై పోస్టర్స్, యాడ్స్ వేస్తే ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ల ప్రకారం కేసులు బుక్ చేస్తమని సంస్థ హెచ్చరించింది.
ఇక సంస్థ ఎండీగా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుండి మాజీ పోలీస్ బాస్ సజ్జనార్ ఆర్టీసీలో తన మార్క్ చూపిస్తున్నాడు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, బస్టాండుల్లో ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువ ధర వసూలు చేసేవారిపై జరిమానాలు విధించడం, బస్టాండు పరిసరాల్లో గుట్కా అమ్మకాల నిషేధం లాంటి నిర్ణయాలు తీసుకున్న సజ్జనార్ తాజాగా ఆర్టీసీ ఆస్తులను డ్యామేజ్ చేసే వారికి ఈ వార్నింగ్ ఇవ్వడంతో తన పోలీసింగ్ మెథడ్స్ ద్వారా ఆర్టీసిని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆర్టీసీని ప్రజలకు దగ్గర చేయడంలో భాగంగా కూడా సజ్జనార్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ప్రజలు వాడుకోవాలని, వారంలో కనీసం ఒక్కరోజైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాల్సిందింగా సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. దీనివల్ల పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుందని ఆయన తెలిపారు.
Tags
Related News
Hyderabad Crime: పార్సిళ్ల పేరుతో లక్షలు దోచేసిన కేటుగాళ్లు.. జనాలకు సజ్జనార్ అలర్ట్
Hyderabad Crime: రోజురోజుకూ క్రైమ్స్ పెరిగిపోతున్నాయే… తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాంకుల పేరుతో, డెలివరి పేరుతో, తాజాగా పార్సిళ్ల పేరుతో నయా దోపిడీకి పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఇటీవల పీహ�