TSRTC : దసరాకి ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ.. అడ్వాన్స్ బుకింగ్‌పై..!
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.ముందుగా టికెట్లు బుక్ చేసుకునే వారికి
- By Prasad Published Date - 03:18 PM, Thu - 21 September 23

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.ముందుగా టికెట్లు బుక్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) నిర్ణయించింది. అక్టోబరు 15 నుంచి 29వ తేదీలోపు ఒకే సమయంలో టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించగా.. 10 శాతం తగ్గింపు కేవలం ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం ఆర్టీసీ చేసింది. ఆ తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30 వరకు ముందస్తు రిజర్వేషన్ ఉంటుందని.. రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ తెలిపింది.గ్రామీణ ప్రాంతాలకు కూడా చాలా మంది రాకపోకలు సాగిస్తున్నారని… ఈ నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 10 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఈ తగ్గింపు దసరా పండుగ సెలవుల్లో 15 రోజులు మాత్రమే వర్తిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ రాయితీ సౌకర్యాన్ని వినియోగించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. TSRTC బస్సులలో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలని తెలిపారు.