HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tspsc Appeal To The Supreme Court On The Cancellation Of Group 1 Prelims Exam

TSPSC -Group 1 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్

TSPSC -Group 1 : గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ ను మరోసారి రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌ చేసింది.

  • Author : Pasha Date : 25-09-2023 - 11:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TGPSC NEW UPDATE

TSPSC -Group 1 : గ్రూప్‌ – 1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ ను మరోసారి రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌ చేసింది. దీనిపై అత్యవసర విచారణ జరపాలంటూ లంచ్‌ మోషన్‌ పిటిషన్ వేసింది. అయితే మంగళవారం విచారణ జరుపుతామని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. ఇప్పటికే రెండుసార్లు ఎగ్జామ్ రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన  తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కారు హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రిలిమ్స్ పరీక్షను రెండున్నర లక్షల మంది అభ్యర్థులు రాశారని.. పరీక్ష సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని టీఎస్ పీఎస్సీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో డివిజన్ బెంచ్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also read : Healthy Lungs : లంగ్స్ ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి..?

2022 ఏప్రిల్‌ 26న 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్‌-1 ప్రకటన (TSPSC -Group 1) వెలువడింది. దీనికి 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని 2023 జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేశారు. జూన్‌లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించేందుకు షెడ్యూలు రిలీజ్ చేశారు. అయితే ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో టీఎస్పీఎస్సీ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది హాజరయ్యారు. ఏకంగా 52 వేల మంది ఈసారి ఎగ్జామ్ రాయలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cancellation of Group 1 Prelims Exam
  • group 1
  • Supreme Court
  • TSPSC Appeal
  • TSPSC Case
  • TSPSC Group 1

Related News

Telangana, Mla Defection

సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

Supreme Court  తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరికీ క్లీన్‌చిట్ ఇస్తూ ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం లేదని

  • Supreme Court allows passive euthanasia for Harish Rana

    సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd