TS Polls – Janasena Candidates List : అభ్యర్థులను ప్రకటించిన జనసేన
మొత్తం ఎనిమిది స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది
- By Sudheer Published Date - 09:50 PM, Tue - 7 November 23

తెలంగాణ ఎన్నికల (TS Polls) బరిలో నిల్చుబోయే అభ్యర్థులను జనసేన పార్టీ (Janasena Party) ప్రకటించింది. మొత్తం ఎనిమిది స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల్లో బిజెపి (BJP) తో కలిసి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో కూకట్ పల్లి, రంగారెడ్డి జిల్లాలో తాండూరు, నల్గొండ జిల్లాలో కోదాడ, మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట టికెట్లకు అభ్యర్థులను ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
కోదాడ నియోజకవర్గం నుంచి మేకల సతీశ్ రెడ్డి, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, నాగర్ కర్నూల్ నుంచి వంగా లక్ష్మణ్ గౌడ్, వైరా నుంచి సంపత్ నాయక్, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు, కూకట్‌పల్లి నుంచి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి శంకర్ గౌడ్, అశ్వారావు పేట నుంచి మూగబోయిన ఉమాదేవి లు జనసేన తరుపున పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Read Also : BJP BC Atma Gourava Sabha: మోడీ నాయకత్వంలో భారత్ 30 ఏళ్ల ప్రగతిని సాధించింది: పవన్