TS Model Schools : మోడల్ స్కూల్స్ దరఖాస్తు గడువు పొడిగింపు.. రూల్స్ తెలుసుకోండి
TS Model Schools : తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి.
- By Pasha Published Date - 12:56 PM, Sun - 3 March 24
TS Model Schools : తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 6వ తరగతి అడ్మిషన్లతో పాటు 7 నుంచి 10 తరగతుల్లోని ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. వాస్తవానికి దీనికి సంబంధించిన దరఖాస్తు గడువు మార్చి 2తో ముగిసింది. తాజాగా ఈ గడువును మార్చి 11 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద విద్యార్థులు రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లిస్తే చాలు. మోడల్ స్కూళ్లు ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఎంపికయ్యే విద్యార్థుల లిస్టును మే 25న రిలీజ్ చేస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూన్ 1న లేదా 2023 – 24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులను నిర్వహిస్తారు. మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో మొత్తం 19,400 సీట్లు ఉన్నాయి. 7 నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 50 మంది చొప్పున విద్యార్థులు ఉంటారు.
We’re now on WhatsApp. Click to Join
- తెలంగాణ మోడల్ స్కూల్స్లో(TS Model Schools) అడ్మిషన్స్ పొందాలని భావించే విద్యార్థులకు 2024 ఆగస్టు 31 నాటికి నిర్దిష్ట వయోపరిమితి ఉండాలి. 6వ తరగతి అడ్మిషన్స్ కోసం 10 సంవత్సరాలు, 7వ తరగతికి 11 సంవత్సరాలు, 8వ తరగతికి 12 సంవత్సరాలు, 9వ తరగతి 13 సంవత్సరాలు, 10వ తరగతికి 14 సంవత్సరాలు వయో పరిమితి విధించారు.
- ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి.
- ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.
- మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు.
- 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది.
- ఎంపికయ్యే వారికి సర్టిఫికెట్ల పరిశీలన మే 27 నుంచి 31 వరకు జరుగుతుంది.
Also Read : Madhavi Latha vs Owaisi : అసదుద్దీన్తో ఢీ.. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరో తెలుసా ?
Related News
Five Government Jobs : హ్యాట్సాఫ్ మమత.. ఒకేసారి ఐదు గవర్నమెంట్ జాబ్స్
Five Government Jobs : విజయం అంటే ఇదే.. గ్రామీణ నేపథ్యం కలిగిన ఆ యువతి ఒకేసారి ఐదు గవర్నమెంట్ జాబ్స్ సాధించి సత్తా చాటుకుంది.