TS : విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్…!!
తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీ ( మ్యూచువల్ ట్రాన్స్ ఫర్)లకు రాష్ట్ర సర్కార్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- By hashtagu Published Date - 03:50 PM, Mon - 20 June 22
తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీ ( మ్యూచువల్ ట్రాన్స్ ఫర్)లకు రాష్ట్ర సర్కార్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కింద ఉపాధ్యాయులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన వెంటనే …విద్యాశాఖలో ఉపాధ్యాయులు పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆ శాఖ అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 2558 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి.
Related News
Telangana Public Holidays: 2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం!
2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23 నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ సెలవులు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ సెలవులు 01/01/2023 – ఆదివారం – న్యూ ఇయర్ 14/01/2023 – శనివారం – భోగి 15/01/2023 – ఆదివారం – సంక్రాంతి