HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Minister Talasani Brothers To Ed

Talasani Brothers: ఈడీ ముందుకు మంత్రి తలసాని బ్రదర్స్!

తెలంగాణలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, వద్దిరాజుల నివాసాల్లో

  • Author : Balu J Date : 16-11-2022 - 2:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Talasani
Talasani

తెలంగాణలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, వద్దిరాజుల నివాసాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. తలసాని మహేష్‌, ధర్మేందర్‌ యాదవ్‌ను ఈడీ విచారిస్తోంది. క్యాసినో, హవాలా కేసులో ఆరోపణలపై ఇరువురిని ఈడీ ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్ వ్యవహారంపైనా విచారణ జరుగుతోంది. గడిచిన నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ చేస్తోందని తెలుస్తోంది.

ఈ అంశం టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఈ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న ప్రగతి భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు వివాదాలకు పోకూడదని, జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తలసాని సోదరులు ఈడీ ముందుకు హాజరుకావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకింత ఆందోళన నెలకొంది.

తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్‌లకు ఈడీ నోటీసులు వచ్చినట్లుగా ఇప్పటి వరకూ బయటకు తెలియదు. వారు విచారణకు హాజరైన తర్వాతనే తెలిపింది. మొత్తంగా వారి వ్యాపారాలకు సంబంధించిన నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీలను తీసుకుని రావాలని ఈడీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే వీరి వ్యాపారాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు భాగస్వామ్యం ఉందో లేదో స్పష్టత లేదు. మంత్రికి మాత్రం ఈడీ నోటీసులు జారీ కాకపోవడంతో.. ఆయన సోదరుల వ్యవహారంలోనే ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ed Raids
  • hyderabad
  • talasani srinivas yadav
  • TRS Ministers

Related News

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  • employer's daughter into stealing 100 tola gold

    ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

Latest News

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

  • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

  • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

Trending News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd