HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Minister Malla Reddy In Anti Plantation Mode

Malla Reddy: మంత్రి మల్లారెడ్డా.. మజాకా!

తమ సొమ్ము సోమవారం..ఒంటి పొద్దులుంటాము..మంది సొమ్ము మంగళవారం...ముప్పొద్దుల తింటాము అంటే ఇదేనెమో...

  • Author : Siddartha Kallepelly Date : 09-04-2022 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Addu
Addu

తమ సొమ్ము సోమవారం..ఒంటి పొద్దులుంటాము..మంది సొమ్ము మంగళవారం…ముప్పొద్దుల తింటాము అంటే ఇదేనెమో…కోట్లు ఖర్చు పెట్టి హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టింది. కానీ రోడ్డునపోయే వారికి తన కమర్షియల్ కాంప్లెక్స్ కనిపించకుండా అడ్డుగా ఉన్నాయన్న కారణంతో 70 చెట్లను నరికించారు మంత్రి మల్లారెడ్డి. కొన్ని చెట్లను వేళ్లతో సహా పెకిలించారు. కొన్నింటి కొమ్మలు నరికేయించారు. పచ్చదనాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం హరితాహారన్ని చేపడుతుంటే.. మంత్రి మల్లారెడ్డి మాత్రం చెట్లను నరికించడం అటవీశాఖ అధికారులను విస్మయానికి గురిచేసింది.

శామీర్ పేట్ మండలం..అలియాబాద్ వద్ద మల్లారెడ్డి ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించారు. దాని ముందు రోడ్డు పక్కన పెద్ద చెట్లు ఉన్నాయి. మంత్రి కూతురు చామకూర ప్రీతి పేరిట అప్లికేషన్ రావడంతో…మూడు చెట్లను నరికేందుకు గతంలో పర్మిషన్ ఇచ్చింది అటవీశాఖ. కానీ ఏకంగా 70 చెట్లను నరికేయించారు. ఇక మంత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. స్పీచ్ ఇవ్వడంలో తనకెవరూ సాటిరారు అనే విధంగా దంచికొడతారు. చెట్లు పెంచితేనే రోగాలు రావు..వర్షాలు కురుస్తాయని చెప్పే పెద్దమనిషి…ఇప్పుడు చెట్లను నరికివేయించడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు చెట్లు నరికితే…వేలల్లో ఫైన్లు వేసే అధికారులు…ఈ ఘటనపై నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. సీఎం తరచుగా ప్రయాణించే రూట్ కావడంతో…తాము మొక్కలు నాటి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెంచామని…వాటిని నరికివేయడంతో తమకు బాధగా ఉందని ఓ ఆఫీసర్ ఆవేదన వ్యక్తం చేశారట. మల్లారెడ్డి మంత్రి కావడంతో ఏం చేయలేకపోతున్నామని చెప్పారట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • controversy
  • Haritha Nidhi
  • Malla Reddy
  • Telanagana

Related News

Maharashtra CM's wife insulted Sreeleela.

Sreeleela: శ్రీలీలను అవమానించిన మహారాష్ట్ర సీఎం భార్య

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీలీల, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య, సామాజిక కార్యకర్త అమృతా ఫడణవీస్ ఒకే వేదికపై సందడి చేశారు. అయితే, అక్కడ జరిగిన ఒక చిన్న పరిణామం శ్రీలీల అభిమానులను మరియు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. కార్యక్రమం ముగిసి

  • Tilak Varma's argument with umpires... Players clashed after the match ended.

    Tilak Varma: అంపైర్లతో తిలక్‌ వర్మ గొడవ.. మ్యాచ్ ముగిశాక కొట్టుకున్న ప్లేయర్స్

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd