Mission Bhagiratha : మిషన్ భగీరథకు అవార్డు రాలేదు…. టీఆర్ఎస్ చెబుతున్నది పచ్చి అబద్ధం..!!
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మిషన్ భగీరథ చుట్టు తిరుగుతున్నాయి. ఈ పథకానికి కేంద్రం అవార్డు ప్రకటించిందన్న వార్తలు వినిపించాయి.
- Author : hashtagu
Date : 02-10-2022 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మిషన్ భగీరథ చుట్టు తిరుగుతున్నాయి. ఈ పథకానికి కేంద్రం అవార్డు ప్రకటించిందన్న వార్తలు వినిపించాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు హడావుడి ప్రకటనలు చేస్తూ ప్రతిపక్షాలను తిట్టిపోస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే…మిషన్ భగీరథకు అసలు జాతీయ అవార్డే రాలేదని..అదంతా పచ్చి అబద్ధమని తేల్చింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖ ఓ ప్రకటనను జారీ చేసింది.
ఈ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయలేదన్నది. తెలంగాణలో వందశాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే వంద శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేధించిందని..జల జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం వంద శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయాలంటూ తెలిపింది. అయితే పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు వందశాతం కనెక్షన్లపై ధ్రువీకరించలేనట్లు వివరించింది.
గ్రామీణప్రాంతాల్లో నీటి సరఫరా విభాగంలో మాత్రమే తెలంగాణ అవార్డుకు ఎంపికైనట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఫంక్షనాలిటీ అసెస్ మెంట్ డేటా ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 ఇళ్లలో శాంపిల్స్ పరీక్షించగా, 8 శాతం ఇళ్లు మాత్రమే ప్రతిరోజు 55 లీటర్ల తలసరి నీటి కంటే తక్కువ పొందుతున్నాయని తేలిందని చెప్పింది. అంతేకాదు మొత్తం నమూనాల్లో 5 శాతం నివాసాల్లో నీటి నాణ్యత JJM నిబంధనల ప్రకారం లేదని గుర్తించినట్లుగా వివరించింది.
మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని….National jal jeevan mission award ప్రకటించడమే నిదర్శనమని టీఆరెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. JNNM ద్వారా కేంద్రం సమీక్షించిన ఈ పథకం వంటి ప్రకటనలతో సహా ప్రచురించిన వార్తలు కూడా తప్పుదారి పట్టించే అంశాలను ఉన్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ పేర్కొంది.