HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Chief And Telangana Cm Kcr To Launch National Party

KCR@National: జూన్ 19న జాతీయపార్టీ ప్రకటించనున్న కేసీఆర్

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు

  • Author : Siddartha Kallepelly Date : 11-06-2022 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్ ఆదిశగా అడుగులు వేస్తున్నాడు. దానిలో భాగంగానే తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మారాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి ‘భారత రాష్ట్ర సమితి’ అన్న పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఈ నెల 19న జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీ విషయంలో తుది నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలతో ప్రగతి భవన్‌లో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో దేశ రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పోషించబోతున్న పాత్రపైనా చర్చ జరిగింది. దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో మనం కీలక పాత్ర పోషిద్దామని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి చర్చ జరగడం లేదని, మాట్లాడదామంటే ‘జైశ్రీరాం’ నినాదాలతో అడ్డుకుంటున్నారని, రాజకీయ లబ్ధికోసం మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 97 శాతం అపజయాలు మూటగట్టుకుందని కేసీఆర్ గుర్తు చేశారు. దేశ ప్రజల అవసరాలు తీర్ఛె౦దుకు జాతీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్దామని నేతలతో కేసీఆర్ అన్నట్టు సమాచారం.

జాతీయ పార్టీ ఏర్పాటు చేద్దామన్న కేసీఆర్ ప్రతిపాదనకు నేతలు కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19లోగా కార్యవర్గ సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చే విషయంలో తుది నిర్ణయం ప్రకటించనున్నారని, నెలాఖరులో ఢిల్లీలో పార్టీని ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • national party
  • telangana CM
  • trs

Related News

Balka Suman

BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమ‌న్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పిలుపునిచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్ సమర్పించిన వీడియో ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేప

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd