HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Travel In The Sky For Only Rs 12 And 4 Seat Drones In Hyderabad Soon

Fly Drone: రూ.12లకే ఆకాశంలో ప్రయాణం.. త్వరలో హైదరాబాద్ లో 4 సీట్ల డ్రోన్లు

ఫ్లైట్ ఎక్కాలంటే వేలల్లో ఖర్చుపెట్టాలి. అది సామాన్యులకు, మధ్యతరగతి వారికి కష్టం.

  • Author : Hashtag U Date : 25-03-2022 - 12:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Drone
Drone

ఫ్లైట్ ఎక్కాలంటే వేలల్లో ఖర్చుపెట్టాలి. అది సామాన్యులకు, మధ్యతరగతి వారికి కష్టం. పోనీ హెలికాప్టర్ లో ప్రయాణమైనా అనుకుంటే.. అది కూడా ఖరీదైనదే. అలాంటిది రూ.12లకే ఆకాశంలో ప్రయాణించవచ్చు.
అని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది? వావ్.. సూపర్ అంటారు. ప్రైవేట్ జెట్ విమాన సర్వీసులను అందించే జెట్ సెట్ గో.. దీని కోసం ప్లాన్ చేస్తోంది. సిటీలోనే ఆకాశంలో తక్కువ ఖర్చుతో డ్రోన్లలో ప్రయాణించడం వల్ల వేగంగా, సురక్షితంగా, తక్కువ ఖర్చులో గమ్యస్థానం చేరుకోవచ్చంటోందీ ఈ సంస్థ.

ఒక భారీ డ్రోన్ లో నలుగురు పట్టేలా సీటింగ్ అరెంజ్ మెంట్ ఉంటుంది. వీటిని ఒకసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంటే ఒకరికి కిలోమీటరుకు రూ.12 ఖర్చు అవుతుంది. వీటినే ఈవీ టోల్స్ సేవలు అంటారు. ఇప్పటికే ఇలాంటి డ్రోన్లను ఎయిర్ బస్ తో పాటు మరికొన్ని సంస్థలు తయారుచేస్తున్నాయి. వీలైనంతవరకు హైదరాబాద్ లోనే ఈరకమైన సేవలు ముందుగా అందుబాటులోకి వచ్చే ఛాన్సుంది.

ఇప్పుడు సిటీలో ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణమంటే చాలా కష్టం. ట్రాఫిక్ తోపాటు ప్రతీదానికి సొంత వాహనాలను బయటకు తీయలేని పరిస్థితి. అందులోనూ కిలోమీటరు ప్రయాణానికి వాటిలో అయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అందుకే కార్లు, ఇతర వాహనాలతో పోలిస్తే.. కాస్త లగ్జరీతో, వేగంగా వెళ్లాలనుకుంటేవారికి ఇలాంటి ఈవీ టోల్స్ బాగా పనికొస్తాయి.

ఈమధ్యకాలంలో ప్రైవేట్ జెట్లకు గిరాకీ బాగా పెరిగింది. హైదరాబాద్ సంగతే చూస్తే.. రోజూ 15 ప్రైవేటు జెట్లు లేదా హెలికాప్టర్లు ల్యాండ్ అవుతున్నాయంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఇలాంటి ప్రైవేటు ల్యాండింగ్స్ దాదాపు 250 ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఇలాంటి సేవలకు గిరాకీ పెరిగింది కాబట్టి.. రోజూ 500 ప్రైవేటు ల్యాండింగ్స్ నమోదయ్యే ఛాన్సుంది. పైగా ప్రైవేటు జెట్ సేవల సెక్టార్ లో దేశంలో ఎక్కువగా హైదరాబాద్ నుంచే గ్రోత్ కనిపిస్తోంది. అందుకే ఈవీ టోల్స్ కు డిమాండ్ పెరిగే ఛాన్సుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4 seater
  • drone
  • drone hyderabad
  • fly in drone

Related News

    Latest News

    • New Year Celebrations : ‘న్యూ ఇయర్’ వేడుకలకు పోలీసుల ‘కొత్త కోడ్’

    • ISRO to launch 6.5-tonne BlueBird-6 : 21న నింగిలోకి ‘బ్లూబర్డ్-6′ శాటిలైట్

    • Responsibilities of Sarpanchs : ఈ నెల 20న కొత్త సర్పంచ్ లకు బాధ్యతలు

    • Vote Chori : ‘ఓట్ చోరీ’పై ఈరోజు కాంగ్రెస్ మెగా ర్యాలీ

    • Messi & Revanth Match : ఇది మరిచిపోలేని క్షణం – రేవంత్ రెడ్డి

    Trending News

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

      • Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

      • Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!

      • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd