Telangana Formation Day : హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫ్రిక్ ఆంక్షలు
ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9. గంటల నుంచి 10 గంటల వరకు.. అలాగే పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు
- Author : Sudheer
Date : 01-06-2024 - 11:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఎందరో అమరుల బలిదానాల మీద ఏర్పడ్డ గడ్డ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నో సంవత్సరాలు సొంత రాష్ట్రం కోసం త్యాగాలు, పోరాటాలు చేస్తే, చివరకు ఎందరో బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం పోరాటాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది పోరాటం చేశారు.
దాని ఫలితంగా 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా, ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు ఆనాటి పోరాటాల ఘటనలను ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయి. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం ఇలా అనేక స్మృతులు పెనవేసుకున్న భాగ్యనగరం దశాబ్ది వేడుకలకు సిద్ధమైంది. ఈ దశాబ్ది ఉత్సవాలకు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే సందర్బంగా ఈరోజు , రేపు నగరంలో ట్రాఫ్రిక్ ఆంక్షలు విధించారు.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9. గంటల నుంచి 10 గంటల వరకు.. అలాగే పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కాబట్టి ఈ ప్రాంతాలకు వెళ్లాలనుకునే కాస్త చూసుకొని వెళ్ళాలి. ఇక రాష్ట్ర దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సోనియాగాంధీని హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
Read Also : Lok Sabha Polls Phase 7 : ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి చెరువులో పడేశారు