TS : కోనాయిపల్లికి సీఎం కేసీఆర్..ఆ సెంటిమెంట్ తో ప్రత్యేక పూజలు..!!
జాతీయ రాజకీయాల్లో తన మార్క్ ను ప్రదర్శించేందుకు సీఎం కేసీఆర్ ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండాలని భావిస్తున్నారు.
- By hashtagu Published Date - 11:42 AM, Mon - 3 October 22
జాతీయ రాజకీయాల్లో తన మార్క్ ను ప్రదర్శించేందుకు సీఎం కేసీఆర్ ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం పకడ్బందీగా వ్యూహాన్ని రచిస్తున్నారు. అందుకే దసరా రోజు జాతీయ పార్టీ పేరు ప్రకటించి..అందులో భాగంగానే నిర్వహించాల్సిన పూజ కార్యక్రమాలను తన సెంటిమెంట్ ప్రకారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం సిద్ధిపేట జిల్లా కోనాయిపల్లికి వెళ్తున్నారు. తాను తలపెట్టిన కార్యక్రమానికి దైవానుగ్రహం కూడా తోడవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాను సెంటిమెంట్ గా భావించే కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. కోనాయిపల్లికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీని ప్రకటించే జాతీయ పార్టీ పేరు ప్రతులతోపాటు ఈనెల 9 వతేదీని కేంద్ర ఎన్నికల సంఘానికి చేసుకునే దరఖాస్తు ప్రతులకు పూజలు చేయించే అవకాశం కనిపిస్తోంది.
తాను చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి దైవానుగ్రహం తీసుకోవడం కేసీఆర్ కు సెంటిమెంట్. అందులో భాగంగానే కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆశీస్సుల తీసుకుంటారు. ఇలా ఆశీర్వాదం తీసుకుంటే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆయన నమ్మకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు…రెండు సార్లు అధికారంలోకి రావడం, పార్టీకి గుర్తింపు లభించింది. ఈ సెంటిమెంట్ ను బలంగా నమ్ముతున్నారు కేసీఆర్. అందులో భాగంగానే సోమవారం జాతీయ పార్టీకి సంబంధించిన పత్రాలు, ఈసీకి సమర్పించే అఫిడవిట్లను దేవుని ముందు ఉంచి ఆశీర్వాదం తీసుకోనున్నారు.
Related News
Indiramma Committees: త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు.. కమిటీలో సభ్యుడికి రూ. 6 వేల జీతం..!
Indiramma Committees: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల హామీల అమలుకు సీఎం రేవంత్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశార�