44228 Jobs : పోస్టాఫీసుల్లో 44,228 జాబ్స్.. తెలుగు రాష్ట్రాల యువతకు గొప్ప ఛాన్స్
వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 44,228 పోస్టుల భర్తీకి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు చెెందిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- By Pasha Published Date - 09:08 AM, Sun - 21 July 24

44228 Jobs : వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 44,228 పోస్టుల భర్తీకి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు చెెందిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్‌లో 1355 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లో, 981 పోస్టులు తెలంగాణలో ఉన్నాయి. పదో తరగతి పాసైన వారు అప్లై చేయొచ్చు. పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎస్టీ, ఎస్సీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై 15న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 5 వరకు అప్లై(44228 Jobs) చేయొచ్చు. అప్లికేషన్లలో ఆగస్టు 6 నుంచి 8 వరకు సవరణలు చేసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుకు(Postal Department) ఎంపికయ్యే వారికి నెలకు రూ.12,000 నుంచి 29,380 దాకా శాలరీ ఇస్తారు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ.10,000 నుంచి రూ.24,470 దాకా శాలరీ ఇస్తారు. అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in/ నుంచి అప్లై చేయాలి. అభ్యర్థులు తొలుత ఈ పోర్టల్‌లో ఇంటి అడ్రస్, ఈ-మెయిల్, ఫోన్ నంబర్లు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. చివరగా అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. మీ డివిజన్, పోస్ట్ ప్రిఫరెన్స్‌లను ఎంచుకోవాలి. మీ విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి. ఫొటో, సిగ్నేచర్లను అప్‌లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Also Read :Phone Tapping Case : ప్రభాకర్‌రావుపై సీఐడీ రెడ్‌కార్నర్ నోటీసు.. నెక్ట్స్ ఏమిటంటే..
బ్యాంకింగ్ జాబ్స్‌కు ప్రిపేరవుతున్న వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. 1040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 8.