TS Assembly : మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ..!!
మంగళవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
- By Bhoomi Published Date - 09:10 PM, Mon - 5 September 22

మంగళవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అసెంబ్లీ కౌన్సిల్ ప్రాంగణంలతోపాటు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమావేశాల పనిదినాలు, ఎజెండా రేపు ఖరారు అవుతాయి. అసెంబ్లీ 8వ సెషన్ కు సంబంధించిన మూడో సమావేశం ప్రారంభం కానుంది. మండలి 18వ సెషన్ కు సంబంధించిన 3వ సమావేశం ప్రారంభం కానుంది.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో సంతరించుకున్న ఈ సమావేవాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధిక వర్షాలు, రైతుల సమస్యలు, పోడు భూముల అంశం, శాంతిభద్రతలు, కేంద్రం వైఖరి వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Related News

Sai Pallavi with Ranbir: రణబీర్ తో సాయి పల్లవి రొమాన్స్.. క్రేజ్ అప్డేట్ ఇదిగో
సౌత్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ హీరో రణ బీర్ తో జోడీ కట్టబోతోంది.