HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Story Behind The 111 Go In Telangana

111 GO: రియ‌ల్టర్ల సామ్రాజ్యంలో `జీవో 111`హుష్‌.!

ఇప్పుడు తెలంగాణలోను... అందులోనూ హైదరాబాద్ లో జీవో 111పై ఒకటే చర్చ. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దాని గురించి మాట్లాడారు. దానిని ఎత్తేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.

  • Author : Balu J Date : 16-03-2022 - 4:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr Job Notification
Cm Kcr Job Notification

ఇప్పుడు తెలంగాణలోను… అందులోనూ హైదరాబాద్ లో జీవో 111పై ఒకటే చర్చ. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దాని గురించి మాట్లాడారు. దానిని ఎత్తేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీంతో ఆ జీవో ఏమిటో.. దానివల్ల లాభనష్టాలు ఎవరికో అన్న చర్చ జరుగుతోంది. జంట జలాశయాల పరిరక్షణ కోసం జారీ చేసిందే జీవో 111. కానీ దీనిని ఎత్తేయడంపై కొందరు సానుకూలంగా ఉంటే మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారు. అసలేమిటీ 111 జీవో?

హైదరాబాద్ శివార్లలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలు ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ కు వీటి నుంచి వచ్చే నీరే దిక్కు. అందుకే అలాంటి జలాశయాలను కాపాడాలనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం తీసుకువచ్చిందే ఈ జీవో 111. దీని ప్రకారం.. వీటి చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో పలు నిర్మాణాలపై నిషేధం ఉంటుంది. ఈ జాబితాలో భారీ హోటళ్లు, కాలుష్య కారక నిర్మాణాలు, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు, నివాస కాలనీలు ఉన్నాయి. ఈ జలాశయాల పరిరక్షణ కోసం 1994లో మొట్టమొదటిసారిగా జీవో నెంబర్ 192 వచ్చింది. తరువాత దానికి కొన్ని మార్పులు చేర్పులూ చేశారు. ఆ తరువాత 1996 మార్చి 8న మరో జీవో వచ్చింది. అదే 111 జీవో. ఈ జీవోలో కొన్ని స్పష్టమైన నిబంధనలను పొందుపరిచారు. దానిప్రకారం.. క్యాచ్ మెంట్ పరిధిలో వేసే లేఅవుట్లలో ఓపెన్ స్థలాలు, రోడ్ల కోసం 60 శాతం స్థలాన్ని విడిచిపెట్టాలి.

రసాయనాలు కాని, క్రిమిసంహారకాలు కాని ఉంటే.. వాటి స్థాయి ఎంత ఉందో తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన సంస్థతో పర్యవేక్షణ జరపాలి. ఎంత భూమినైతే వినియోగిస్తు్న్నారో అందులే 90 శాతం జాగాను కన్జర్వేషన్ కోసం వదలాలి. ఈ విషయంలో హుడాదే బాధ్యత. ఇక అన్నింటికీ మించిన మరో పాయింట్.. ఈ పరిధిలో జీ+2 నిర్మాణాలను అనుమతించరు. ఈ పాయింట్ స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. అప్పట్లో హైదరాబాద్.. ఈ జంట జలాశయాల నీటిపై ఆధారపడినా.. తరువాతి కాలంలో కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయి. అందుకే ఆ జలాశయాల నీరే ఆధారం అనే పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చింది. దీనివల్లే 111 జీవోను పూర్తిగా ఎత్తేయాలని, లేదా దాని పరిధిని తగ్గించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో ఈ జీవోపై అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఓ కమిటీ వేసింది. ఇక జీవో ఎత్తేయాలని చాలామంది హైకోర్టుకు వెళ్లారు. ఉన్నత న్యాయస్థానం కూడా 111 జీవోపై ప్రభుత్వ వైఖరిని తెలపాలని ఆదేశించింది. కేసీఆర్ కూడా కిందటేడాది ఈ జీవోపై సమీక్ష చేశారు. జలాశయాల పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్లాన్ తయారుచేయాలన్నారు. ఇప్పుడు ఏకంగా ఈ జీవో రద్దు ప్రకటనను స్వయంగా కేసీఆరే చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 111 GO
  • cm kcr
  • telangana
  • Telangana Assembly

Related News

Ustaad Bhagat Singh Tiket P

Ustaad Bhagat Singh : తెలంగాణ లో సాధారణ టికెట్ ధరలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

తెలంగాణలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, ఫ్యాన్స్‌కు మరియు సామాన్య ప్రేక్షకులకు ఊరటనిచ్చే అంశం

  • Uttam Rabi

    Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

  • New Airports In Ap

    New Airports in Telangana : జూన్ లో 2 ఎయిర్పోర్టులకు శంకుస్థాపన?

  • Tg Assembly Session

    TG Assembly Session : నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  • No shortage of cooking gas in Telangana: Uttam Kumar Reddy

    Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత

Latest News

  • Doomsday Plane : ‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

  • స్నానం సమయంలో మూత్ర విసర్జన చేస్తున్నారా? ఆరోగ్యంపై ప్రభావం ఇదే

  • Free Bus : రేపటి నుండి ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

  • Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందే ఓవర్సీస్‌లో రికార్డుల వేట

  • AP Govt : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ – ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd