Chicken Price : చికెన్ ప్రియులకు షాక్.. కోడి కూర ధరకు రెక్కలు
Chicken Price : కోడి ధర కొండెక్కింది. నిన్నమొన్నటి వరకు కేజీకి రూ.150లోపే పలికిన చికెన్ ధర.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది.
- By Pasha Published Date - 07:25 AM, Mon - 18 December 23

Chicken Price : కోడి ధర కొండెక్కింది. నిన్నమొన్నటి వరకు కేజీకి రూ.150లోపే పలికిన చికెన్ ధర.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. కార్తీక మాసం ఎఫెక్టుతో తగ్గిపోయిన చికెన్ ధర.. ఆ మాసం ముగియగానే రెక్కలు తొడిగింది. కార్తీక మాసం ముగియగానే చికెన్ షాపులకు జనం రద్దీ పెరిగింది. దీంతో ఆటోమేటిక్‌గా రేటు కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్కిన్ లెస్ చికెన్ ధర కిలోకు రూ. 210 నుంచి రూ.260 దాకా పలుకుతోంది. ఈ రేటు తెలుసుకొని చికెన్ ప్రియులు షాక్ అవుతున్నారు. ధర పెరగడంతో చికెన్ ప్రియులు కేజీ కొనాల్సిన చోట అరకేజీకే పరిమితం అవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్, క్రిస్టమస్, న్యూయర్ వేడుకలు అన్నీ కలిసి ఒకేసారి రావడంతో చికెన్ డిమాండ్ (Chicken Price) అమాంతం పెరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు కూరగాయల ధరలు మండుతున్నాయి. మటన్ కూడా కేజీ రూ. 800 నుంచి రూ. 1000 పలుకుతోంది. దీంతో చాలా మంది ఏదో తిన్నాంలే అన్నట్లుగా అరకేజీ, పావుకేజీతో మమ అనిపిస్తున్నారు. హోల్‌సేల్, వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి ధరలు తగ్గుతున్నా బహిరంగమార్కెట్లలో తగ్గడం లేదు. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి కనిష్ఠ ధర కిలో రూ.5 పలుకుతుండగా బహిరంగ మార్కెట్‌లో దాన్ని రూ.30కే విక్రయిస్తున్నారు. తోపుడు బండ్లపై కిలో రూ.30కు, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో రూ.40 నుంచి రూ.50కి విక్రయిస్తున్నారు.