Battalion Constable : బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల విషయంలో దిగొచ్చిన ప్రభుత్వం
battalion constables : కానిస్టేబుళ్ల సెలవుల విధానంపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది
- By Sudheer Published Date - 09:35 PM, Fri - 25 October 24

రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల (Battalion Constable) కుటుంబాల ఆందోళనల నేపథ్యంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుళ్ల సెలవుల విధానంపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు మాత్రం ఐదేళ్లపాటు ఒకే ప్రాంతంలో పోస్టింగ్, అలాగే ఒకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం అనుసరించాలనే డిమాండ్లు ఉంచారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బెటాలియన్ కానిస్టేబుళ్లు 15 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చి కొత్త లీవ్ మాన్యువల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ మ్యాన్యువల్‌పై బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పలు బెటాలియన్ల ముందు ధర్నా చేయగా.. ఈరోజు ఏకంగా సెక్రటేరియట్ ముట్టడికి కూడా యత్నించారు. దీంతో రేవంత్ సర్కార్ దిగొచ్చి ఆ జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది.
Read Also : Diwali Donations : దీపావళి రోజు చేయాల్సిన దానాలు