Dasara : TGSRTC ఖజానా నింపింది ..రూ.307.16 కోట్ల మేర ఆదాయం
Dasara : దసరా మరియు బతుకమ్మ పండగల సందర్భంగా సంస్థకు భారీగా ఆదాయం అందుకుందని వెల్లడించారు
- Author : Sudheer
Date : 22-10-2024 - 11:25 IST
Published By : Hashtagu Telugu Desk
దసరా (Dasara) పండగ TGSRTC కి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. తెలంగాణ లో అతిపెద్ద పండగ అంటే దసరా అనే చెప్పాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్న సరే దసరా పండగకు తమ సొంతరికి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా దసరా ను జరుపుకుంటుంటారు. ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని తాకాయి. దసరా సందర్బంగా TGSRTC సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసింది.
తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు మంగళవారం హైదరాబాద్‌లో మీడియా తో మాట్లాడుతూ.. దసరా మరియు బతుకమ్మ పండగల సందర్భంగా సంస్థకు భారీగా ఆదాయం అందుకుందని వెల్లడించారు. ఈ నెల అక్టోబర్ 1 నుంచి 15 వరకు సంస్థకు రూ. 307.16 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. దాదాపు 707.73 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు వారు తెలిపారు. పండగల వేళ, సాధారణంగా నడిచే బస్సు సర్వీసులపై ఆధారపడడం కాకుండా, అదనపు సర్వీసులను కూడా తెలంగాణ ఆర్టీసీ అందించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ 10,513 బస్సులను అదనంగా నడిపించిన వివరాలు వెల్లడించారు.దీని ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించినట్లు అయ్యిందన్నారు.
Read Also : Gangavva : బిగ్ హౌస్ లో గంగవ్వకు గుండెపోటు..?