Minor Girl Raped : ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు ఓ దర్మార్గుడు
- Author : Sudheer
Date : 16-06-2024 - 12:51 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం (Minor Girl Raped), హత్య ఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క లు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావు లతో కలిసి పరిశీలించారు. రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు ఓ దర్మార్గుడు. కాట్నపల్లి మమత రైస్‌మిల్‌లో ఈఘటన చోటు చేసుకుంది. యూపీకి చెందిన కూలీ బలరాం బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీపుటేజీలో రికార్డ్ అయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
బాలిక తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తుండగా బలరాం బాలికను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి నిద్ర లేచి చూసేసరికి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బాలిక కోసం వెతకగా సమీపంలోని పొదల్లో మృతదేహం కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సుల్తానాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇక ఆదివారం ఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క లు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావు లతో కలిసి పరిశీలించారు. రామగుండం సిపి శ్రీనివాసును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also : TDP – INDIA bloc : టీడీపీ లోక్‌సభ స్పీకర్ అభ్యర్థికి ‘ఇండియా’ మద్దతు : సంజయ్ రౌత్