LB Stadium : ఎల్బీ స్టేడియంలో కుర్చీలతో పొట్టు పొట్టుగా కొట్టుకున్న పహిల్వాన్లు
ఇద్దరు పహిల్వాన్‌ల మధ్య మొదలైన వాగ్వాదం..ఆ తర్వాత రెండు వర్గాల మధ్య పరస్పర దాడులకు దారి తీసింది. స్టేడియంలోని జనం మధ్య కుర్చీలతో పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు
- By Sudheer Published Date - 11:16 AM, Sat - 7 October 23

హైదరాబాద్ ఎల్బీ స్టేడియం (LB Stadium)లో గత రాత్రి జరిగిన మోదీ కేసరి దంగల్ కుస్తీ పోటీలు (Wrestling Match) ఉద్రిక్తతకు దారితీసాయి. ఇద్దరు పహిల్వాన్‌ల మధ్య మొదలైన వాగ్వాదం..ఆ తర్వాత రెండు వర్గాల మధ్య పరస్పర దాడులకు దారి తీసింది. స్టేడియంలోని జనం మధ్య కుర్చీలతో పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఈ ఘటన లో ప్రేక్షకులకు సైతం గాయాలయ్యాయి. దాడులతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు స్టేడియం నుండి బయటకు పరుగులు తీశారు. జోక్యం చేసుకున్న పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
స్థానికులు, పోటీలు నిర్వహించిన నిర్వహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి ఇరు వర్గాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మొదట ఎవరు ఎవరిపై దాడి చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. రెండు రోజుల పాటు ఈ పోటీలు జరగాల్సి ఉండగా.. నిన్నటి ఘర్షణతో అప్పటి వరకు పోటీలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈరోజు పోటీలు నిర్వహిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Congress Bus Yatra : 15 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ? జనంలోకి ఖర్గే, రాహుల్, ప్రియాంక