Winter peaks : వణికిస్తున్న చలి.. జర భద్రం!
ఈ ఏడాది తెలంగాణపై ‘చలి ప్రభావం’ చాలా తక్కువే అని భావించారు చాలామంది. కానీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవత్ర పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల
- By Balu J Published Date - 02:34 PM, Fri - 17 December 21

ఈ ఏడాది తెలంగాణపై ‘చలి ప్రభావం’ చాలా తక్కువే అని భావించారు చాలామంది. కానీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవత్ర పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదుకావడంతో చలిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు అత్యల్పంగా కుమ్రం భీమ్‌లోని గిన్నెదారిలో 8.0 డిగ్రీల సెల్సియస్, వికారాబాద్‌లోని మర్పల్లెలో 8.9 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలోని కోహీర్‌లో 9.0 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డిలోని రెడ్డిపల్లెలో 9.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో అత్యల్పంగా 12.0 డిగ్రీల సెల్సియస్, ఆసిఫ్‌నగర్‌లో 13.9 డిగ్రీల సెల్సియస్, గోల్కొండలో 13.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బాలాజీ అనే వ్యక్తి ట్విట్టర్ లో వాతావరణ మార్పులకు సంబంధించి ఓ ఫోస్టు షేర్ చేశాడు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో తీవ్రమైన చలిగాలులు ఉన్నాయని తెలిపాడు. అయితే కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో చలి తీవ్రత కూడా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. చలి కారణంగా జలుబు, దగ్గు లాంటి వ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంది. ఓమిక్రాన్ ముప్పు ఉన్నందున ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
SEVERE COLD WAVE ALERT ⚠️
Strong northerly winds will bring coldest spell of this season in entire #Telangana 🥶
Temperature will drop upto 3-5°C in parts of North, West Telangana and upto 7-8°C in parts of #Hyderabad during December 18-22 ⚠️.
Get your sweaters ready 😀👍
— Telangana Weatherman (@balaji25_t) December 14, 2021