Telangana Schools : తెలంగాణ హైస్కూల్ టైమింగ్స్ లో మార్పు
ఇప్పటి వరకు ఉదయం 9.30 గంటలకు ఉన్నత పాఠశాలలు ప్రారంభం అవుతుండగా, ఇకపై 9 గంటలకే మొదలవుతాయి
- By Sudheer Published Date - 07:40 PM, Sat - 20 July 24

తెలంగాణలో ఉన్నత పాఠశాలల పని వేళల్లో ప్రభుత్వం మార్పులు (Telangana Schools New Timings ) చేసింది. ఇప్పటి వరకు ఉదయం 9.30 గంటలకు ఉన్నత పాఠశాలలు ప్రారంభం అవుతుండగా, ఇకపై 9 గంటలకే మొదలవుతాయి. ఈమేరకు అరగంట ముందుగా పాఠశాలలు ప్రారంభించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం అరగంట ముందుగా స్కూల్ పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఉదయం 9.30 గంటలనుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనివేళలు ఉండగా.. ఇకపై ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 4.15 గంటలకు పనివేళలను మారుస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం యథావిధిగా ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల నిర్వహణ కొనసాగనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే తెలంగాణ (Telangana) లోని అన్ని జిల్లాలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటకు (Secondary Education System) ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం రేవంత్ (CM Revanth) ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులతో సమావేశం జరిపారు. ఈ సమావేశంలో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీచేశారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీ ప్లే స్కూళ్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్‌వాడీల్లో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్‌ను నియమించాలని కోరారు.
గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు చేయాలనీ , మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అధికారులు కష్టపడి పని చేయాలన్నారు. అందుకు విద్యావేత్తల విలువైన సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా చేపట్టాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాల్లో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు.
Read Also : Ridge Gourd Bajji : వర్షాకాలంలో హెల్దీగా బీరకాయ బజ్జీ.. ఎలా తయారు చేయాలో తెలుసా?