HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Rising 2047 Agreements Worth Over Rs 1 Lakh Crore

Telangana Rising 2047 : రూ. లక్ష కోట్లకుపైగా ఒప్పందాలు

Telangana Rising 2047 : ఈ సదస్సుకు సుమారు 4,800 మందికి పైగా ఆహ్వానాలు పంపగా, ఇప్పటికే 600 మందికిపైగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తమ సంసిద్ధతను తెలియజేశారు

  • Author : Sudheer Date : 05-12-2025 - 12:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Rising 2047 2
Telangana Rising 2047 2

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 మరియు 9వ తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది. ‘తెలంగాణ రైజింగ్ థీమ్’ తో నిర్వహించనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ విదేశాలకు చెందిన దిగ్గజాలు, పరిశ్రమల అధినేతలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, సినీ, క్రీడా, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు, విదేశీ రాయబారులు ఒకే వేదికపైకి రానున్నారు. ఈ సదస్సుకు సుమారు 4,800 మందికి పైగా ఆహ్వానాలు పంపగా, ఇప్పటికే 600 మందికిపైగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తమ సంసిద్ధతను తెలియజేశారు. మొత్తంమీద సుమారు 1000 మందికిపైగా ప్రముఖ అతిథులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Tirumala Darshan Tickets : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్లతో బ్రేక్ దర్శనం స్కాం..!

రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సులో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వృద్ధిని $3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిష్ణాతులతో చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారించే అంశాలలో కాలుష్య రహితం (నెట్ జీరో), సెమీ కండక్టర్ల పరిశ్రమ అభివృద్ధి, కృత్రిమ మేధ (Artificial Intelligence), నైపుణ్యంతో కూడిన మానవ వనరుల అభివృద్ధి, మహిళా సాధికారత, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వృద్ధి, క్రీడాభివృద్ధి వంటి అంశాలు ఉన్నాయి. ఈ చర్చల ద్వారా రాష్ట్రంలో సుమారు రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులకు సంబంధించిన కీలక ఒప్పందాలు (MoUs) జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అతిథులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సదస్సు తెలంగాణకు పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించడానికి దోహదపడుతుంది. ప్రముఖుల మేధోమథనం ద్వారా లభించే సూచనలు, ప్రణాళికలు రాబోయే దశాబ్దాలలో రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధి లక్ష్యాల సాధనకు దిశా నిర్దేశం చేయనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Global summit
  • Global Summit 2025
  • hyderabad
  • Telangana Rising - 2047 vision
  • Telangana Rising 2047 Agreements
  • Telangana Rising 2047 Agreements worth over Rs. 1 lakh crore
  • Telangana Rising-2047

Related News

Tollfree

హైదరాబాద్‌కు తిరిగివచ్చే వారికి అలర్ట్

కేవలం ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3.04 లక్షల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఇందులో దాదాపు 2.04 లక్షల వాహనాలు హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లగా, ఇప్పుడు ఆ వాహనాలన్నీ తిరుగుప్రయాణం పట్టాయి

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    నేటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

  • Districts Telangana

    జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు సాధ్యం కాదా?

  • CM Revanth Reddy

    ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి కానుక

  • Cm Revanth Mptc Zptc

    జిల్లాల పునర్విభజన కోసం కమిటీ ఏర్పాటు చేయబోతున్న సీఎం రేవంత్

Latest News

  • బంగారం కొనాల‌నుకునేవారికి బిగ్ అల‌ర్ట్‌.. 10 గ్రాముల ధర రూ. 40 లక్షలు?!

  • మూడో వ‌న్డే భార‌త్‌దేనా? ఇండోర్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజ‌య‌మే!

  • రోగనిరోధక శక్తి పెర‌గాలంటే రోజూ ఇలా చేయాల్సిందే!

  • క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ నిపా వైరస్.. వీటికి దూరంగా ఉండాల్సిందే!

  • సంక్రాంతి 2026 విన్నర్ ఎవరో తేలిపోయింది.. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్‌, నవీన్‌. ?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. గిల్‌కు చోటు ద‌క్క‌పోవడంపై గుజరాత్ టైటాన్స్ యజమాని స్పంద‌న ఇదే!

    • మెగాస్టార్ సినిమాకు కొత్త స‌మ‌స్య‌.. ఏంటంటే?

    • బడ్జెట్ 2026.. ప్ర‌ధాన మార్పులివే?!

    • ఇరాన్‌లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd