Telangana Rains: తెలంగాణాలో ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది?
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో వర్షాల ధాటికి ఢిల్లీలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 03:41 PM, Thu - 20 July 23
 
                        Telangana Rains: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో వర్షాల ధాటికి ఢిల్లీలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. యమున నది పొంగిపొర్లడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ప్రమాదం లేకపోయినా ఇదే పరిస్థితి కొనసాగితే ఆందోళనకరంగా మారే అవకాశముంది. హైద్రాబాద్లో తేలికపాటి వర్షం కురిస్తేనే రోడ్లన్నీ సముద్రంలా మారిపోతాయి. . మూడు రోజులుగా హైద్రాబాద్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు కాలనీలు వర్షానికి ప్రభావితమయ్యాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సహాయక చర్యల్లో పాల్గొంటుంది. ఎండిఆర్ఎస్ బృందాలు రోడ్లపైకి వచ్చి వర్షపు నీటిని రోడ్లపై నిల్వకుండా జాగ్రత్తపడుతున్నారు.
రెండు తెలుగురాష్ట్రాల్లో 18వ తేదీ తెల్లవారుజామున నుండి విస్తారంగా ముసురుతో కూడిన వర్షాలు కురవడం మొదలయ్యాయి. ఇప్పటివరకు రాయలసీమ మరియు దక్షిణ-కోస్తాంధ్ర జిల్లాల్లో తక్కువ వర్షాలు ఉన్నప్పటికీ, క్రమంగా ఈ జిల్లాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకు కూడా రెండు తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి ముసురుతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉదయం 8:30 వరకు గడచిన 24 గంటల్లో తెలంగాణ జిల్లాల్లో కురిసిన అతి వర్షపాతం నమోదైన ప్రాంతాలు చూసుకుంటే.. జనగాం జిల్లాలో 192.3 ఎంఎం, యాదాద్రిలో 176.0 ఎంఎం , మెదక్ 154.0 ఎంఎం, వరంగల్ లో 142.8 ఎంఎం, తదితర జిల్లాలో వర్షపాతం కింద పేర్కొన్న పట్టికలో గమనించవచ్చు.

Also Read: Delhi Lovers: రోడ్డు పై రెచ్చిపోయిన ప్రేమజంట, దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు
 
                    



