High Court : టీ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..
- Author : Sudheer
Date : 07-03-2024 - 11:51 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర సర్కార్ (Telangana Govt) కు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ (Governor Kota MLC) అభ్యర్థుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కోదండరామ్, అమీర్ అలీఖాన్లను నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను కొట్టిపారేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని ఆదేశించింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని సూచించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పున:సమీక్షించుకోవాలని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రభుత్వ సిఫార్సులపై ఎమ్మెల్సీలుగా కోదండరాంతో పాటు సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. ఈ వ్యవహారంపై జనవరి 30న హైకోర్టు స్టే విధించింది. కోదండరాం కోదండరాం, అలీఖాన్‌ల అలీఖాన్ నియామకాలను రద్దు చేయడంతో పాటు గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక తీర్పు వెలువరించింది. గత ఏడాది గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్‌ఖు సిఫార్సు చేసింది. ఆ పేర్లను గవర్నర్ తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత జనవరిలో కోదండరాం, అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడంతో గవర్నర్ అమోదించారు. కోర్టు వివాదం పెండింగ్‌లో ఉండగా నియామకాలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది. రెండు వేర్వేరు పిటిషన్లపై నేడు తీర్పు వెలువడింది. ఎమ్మెల్సీల నియామకాలను రద్దు చేయడానికి గవర్నర్‌కు అధికారం లేదని, పేర్లను క్యాబినెట్‌కు తిప్పి పంపాలని స్పష్టం చేసింది. మరో పిటిషన్‌లో కోదండరాం, అలీఖాన్‌ల నియామకంపై కోర్టు స్టే విధించింది. తాజాగా నియామకాలను రద్దు చేసింది. క్యాబినెట్ ద్వారా ఎమ్మెల్సీలపై సిఫార్సులను పరిగణలోకి తీసుకుని జాబితాను గవర్నర్‌కు పంపాలని ఆదేశించింది.
Read Also : CM Revanth Reddy : ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది