అధికార పార్టీ ఇచ్చే హామీలు చట్టాలు కావు
అధికార పార్టీ ఇచ్చే హామీలు చట్టం కాదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంపు అమలు తేదీని ముందుకు జరపడం సాధ్యంకాదని, ఆ విషయంలో అసలు జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
- By Hashtag U Published Date - 10:55 AM, Sat - 6 November 21

అధికార పార్టీ ఇచ్చే హామీలు చట్టం కాదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంపు అమలు తేదీని ముందుకు జరపడం సాధ్యంకాదని, ఆ విషయంలో అసలు జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంపు ఈ ఏడాది మార్చి 30 నుంచి అమలులోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 45 జారీచేసింది. అంతకంటే ముందు పదవీవిరమణ చేసిన పలువురు ఉద్యోగులు ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. పదవీవిరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతామని అధికార టీఆర్‌ఎస్ పార్టీ 2018లో హామీ ఇచ్చినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం పదవీవిరమణ వయస్సును 58 నుంచి 61కి పెంచుతూ శాసనసభ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల చట్టం సవరణ 2021ను ఆమోదించిందని తెలిపింది.
Also Read : Etala : హుజురాబాద్ ప్రజలు కేసీఆర్, హరీశ్ రావుకు కర్రుకాల్చి వాతపెట్టారు!
అపాయింటెడ్ డేను ఎప్పటి నుంచి అమలు చేసినా ఎవరో ఒకరు అసంతృప్తికి గురికాకతప్పదని తెలిపింది. న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవల్‌పమెంట్ అథారిటీ కేసులో అపాయింటెడ్ డే అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోవలసిన అవసరంలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు హైకోర్టు గుర్తుచేసింది. ఆ కేసులో అపాయింటెడ్ డే మార్చుతూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసిందని గుర్తుచేసింది.
Related News

Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!
ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.