Governor Jishnu Dev Varma : గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకం
Governor Jishnu Dev Varma : తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతోందని, అందుకే రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు
- Author : Sudheer
Date : 12-03-2025 - 12:26 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో (Telangana Assembly Budget Session) గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేపట్టిన కీలక సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతోందని, అందుకే రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మరియు మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ఆయన ప్రస్తావించారు.
Assembly : అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్..
ముఖ్యంగా మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) రాష్ట్రంలో గేమ్ ఛేంజర్(Game Changer)గా మారిందన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల వారికి భారీగా ఉన్న ఆర్థిక భారం తగ్గింది. మొత్తం 149.63 లక్షల ఉచిత బస్సు ట్రిప్పులు కల్పించడం ద్వారా మహిళలు సుమారు రూ. 5005 కోట్లు ఆదా చేసుకున్నారని గవర్నర్ పేర్కొన్నారు. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే చర్యగా ప్రశంసలు పొందుతోంది. అలాగే ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
God Is Real : దేవుడు ఉన్నాడు.. గణిత ఫార్ములాతో నిరూపిస్తా.. శాస్త్రవేత్త విల్లీ సూన్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నాయి. రైతులకు పంట సాయం, రుణమాఫీ, విద్యుత్ సౌకర్యం, మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రజల నిత్యజీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. అదేవిధంగా, కృష్ణా జలాల పట్ల తెలంగాణకు న్యాయమైన వాటా అందించేందుకు కృషి చేస్తున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అయితే ఈ కార్యక్రమాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గవర్నర్ ప్రసంగం అనంతరం తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది.