Hydraa : హైడ్రాలో కొత్తగా 169 పోస్టులు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
Hydraa : కొత్తగా హైడ్రా లో 169 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులను వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించేందుకు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- By Sudheer Published Date - 08:44 PM, Wed - 25 September 24

Government Orders Allocating 169 Staff To Hydraa : ‘హైడ్రా’ (HYDRA ) తగ్గేదేలే అంటూ అక్రమ కట్టడాలను కూల్చేస్తు (Demolishing ) అక్రమరాయుళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చేసి పనిలో పడింది. గత కొద్దీ రోజులుగా నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూలుస్తు వస్తుంది. కాగా ఇప్పుడు కొత్తగా హైడ్రా లో 169 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులను వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించేందుకు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 169 మందిని డెప్యూటేషన్‌పై నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది సీఐలు, 16మంది ఎస్‌ఐలు, 60 మంది పోలీస్ కానిస్టేబుల్స్‌ని నియమించింది. అలాగే, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను హైడ్రాకు డిప్యూటేషన్‌పై సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై బాధితులు(Victims )ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఇది అధికారుల తప్పే. వాళ్లు కట్టడానికి అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అకారణంగా కూల్చివేసి మా కుటుంబాల్ని రోడ్డున పడేశారని విలపిస్తున్నారు. తామంతా అద్దెకు ఉంటున్నామని , ల్యాండ్ లీజ్ కు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నామని , లక్షల అప్పులు చేసి వ్యాపారం మొదలుపెట్టామని..ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తే..ఎలా అని వారంతా వాపోతున్నారు.
Read Also : Pregnancy Tips : ఆలస్యంగా గర్భం ధరించడం వల్ల మీ బిడ్డకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా.?