HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Global Summit 2025 Updates

Telangana Rising Global Summit 2025: సమ్మిట్‌ లో ఏం చర్చించనున్నారంటే?

Telangana Rising Global Summit 2025: రంగారెడ్డి జిల్లాలోని మీర్‌ఖాన్‌పేటలో దాదాపు వంద ఎకరాల్లో నిర్మిస్తున్న 'ఫ్యూచర్ సిటీ' ప్రాంగణంలో ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ముస్తాబు చేస్తున్నారు

  • Author : Sudheer Date : 06-12-2025 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Rising Global Summit
Telangana Rising Global Summit

తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మిట్‌ కోసం తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంది. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సమ్మిట్ ను అట్టహాసంగా జరిపేందుకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తుంది. రంగారెడ్డి జిల్లాలోని మీర్‌ఖాన్‌పేటలో దాదాపు వంద ఎకరాల్లో నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాంగణంలో ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల (Three Trillion Dollar) ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉద్దేశించిన ప్రత్యేక విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించబోతున్నారు. కేవలం రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సమ్మిట్‌కు, 40కి పైగా దేశాల నుంచి దాదాపు 1500 మంది విదేశీ ప్రతినిధులు (ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ రంగాల దిగ్గజాలు సహా) మరియు పలువురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

EMI : ఇండియాలో ఎన్ని కోట్ల మంది EMIలు కడుతున్నారో తెలుసా?

డిసెంబర్ 8 సోమవారం మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమవుతుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయర్‌ హాజరై ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. వేదికపై బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ కె. బెరి, మరియు ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్‌ వంటి ప్రముఖులు పాల్గొంటారు. అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ & సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మరియు వరల్డ్‌బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా వంటి ప్రపంచ దిగ్గజాలు వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో కాలుష్యరహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, ఏరోస్పేస్, గిగ్ ఎకానమీ మరియు మూసీ నది పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై మొత్తం 26 ప్యానల్ డిస్కషన్స్ జరగనున్నాయి.

భారీ సంఖ్యలో వివిఐపిలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సీనియర్ ఐఏఎస్‌ అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రతా విషయంలో మూడంచెల భద్రత కల్పిస్తున్నారు, దీని కోసం వెయ్యికిపైగా సీసీ కెమెరాలు మరియు 2,500 మంది పోలీసులు (ట్రాఫిక్ నియంత్రణతో సహా) విధుల్లో ఉంటారు. సాంకేతిక పరంగా ఫ్యూచర్ సిటీలో 100% అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఒకేసారి 10 వేల మంది వైఫై వినియోగించుకునేలా సదుపాయం ఉంది. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా, 3,000 టన్నుల సామర్థ్యం గల ఏసీ యంత్రాలతో పాటు, సదస్సు కార్యక్రమాలను ఎక్కడి నుంచైనా వీక్షించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు సిద్ధం చేశారు. ఆదివారం నాటికి పనులన్నీ పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Global summit
  • hyderabad
  • telangana global summit 2025 location
  • Telangana Rising Global Summit
  • Telangana Rising Global Summit 2025

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

    • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd