HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cm Kcr To Inaugurated Brs Central Office In Delhi

BRS Office: ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం, పార్టీ విస్తరణపై కేసీఆర్ ఫోకస్!

దేశ రాజధాని ఢిల్లీలోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.

  • Author : Balu J Date : 04-05-2023 - 5:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr
Cm Kcr

దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయన్ని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. మొదట బిఆర్ఎస్ (BRS Party) భవన్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన కేసీఆర్ ఆ తర్వాత వైదిక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మధ్యాహ్నం 1 గంట. 5 నిమిషాలకు రిబ్బన్‌ కట్‌ చేసి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. బీఆర్ఎస్ భవన ప్రారంభోత్సవం అనంతరం మొదటి అంతస్తులోని పార్టీ అధ్యక్ష కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు.

బిఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ భవన్ నుండి దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కె. చంద్రశేఖర్ రావు (CM KCR) స్వాగతం పలుకుతూ పోస్టర్లు, బ్యానర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. ఉదయం నుంచే కార్యాలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బారులు తీరారు. బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు (Party Leaders), కార్యకర్తల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు నేతలు పాదాభివందనం చేశారు. అయితే జాతీయ ముఖ్య నేతలు హాజరుకాలేదని తెలుస్తోంది.

బిఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సాధారణ వాహనాల రాకపోకలు కాసేపు నిలువరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీఆర్‌ఎస్ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది. బిఆర్ఎస్ మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుని కార్యాలయం ఉంది. ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిండెంట్ లకు (KTR) ప్రత్యేక ఛాంబర్లు కేటాయించారు. వీటితో ఇతర అవసరాల కోసం మొత్తం పద్దెనిమిది గదులు భవన్ లో ఉన్నాయి. పార్టీ సమావేశాల కోసం భవన్ లో విశాలమైన సమావేశ మందిరాన్ని కేటాయించారు. దేశ రాజధాని కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం కావడంతో పార్టీ విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్ సభలో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్‌, వెంకటేష్‌ నేత, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి , ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్‌ చధుని తదితరులు పాల్గొన్నారు.

Also Read: Samantha@1: బాలీవుడ్ స్టార్స్ కు సమంత షాక్.. ఇండియన్ సెలబ్రిటీలో నెంబర్1


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Office
  • cm kcr
  • delhi
  • Started

Related News

Death

Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో 25 ఏళ్ల దీపిక నాగర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అత్త ఇంటిలోని పైకప్పు నుంచి పడిపోయి మృతి చెందినట్టు పోలీసులు చెబుతుండగా… ఇది ఆత్మహత్య కాదు, కట్నం కోసం చేసిన హత్య అని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. “ఫార్చ్యూనర్ కారు, ₹51 లక్షలు కావాలని వేధించారు. పెళ్లిలోనే ₹11 లక్షల నగదు, ₹50 లక్షల బంగారం, ఫర్నిచర్, స్కార్పియో కారు ఇచ్చాం” అంటూ త‌న తం

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

Latest News

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd