HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cm Kcr Inaugurates T Hub 2 0

T Hub: టీ హబ్‌ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్.. దేశానికే రోల్ మోడల్ అని వ్యాఖ్య

  • Author : Hashtag U Date : 28-06-2022 - 10:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T Hub Cm
T Hub Cm

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ ‘టీ–హబ్‌’ రెండో దశను సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జి హబ్ లో ప్రారంభించారు. ప్ర‌పంచానికి యువ భార‌త్ సామ‌ర్థ్యాన్ని తెలుపాల‌నే సంకల్పంతో టీ హ‌బ్ ప్రారంభించిన‌ట్లు కేసీఆర్ తెలిపారు. టీ హ‌బ్ నేష‌న‌ల్ రోల్ మోడ‌ల్ అన్నారు. తెలంగాణ స్టార్ట‌ప్ పాల‌సీ స్ప‌ష్టంగా ఉంద‌ని ఆయన చెప్పారు. టీ హ‌బ్ స్థాపించాల‌నే ఆలోచ‌న‌కు 8 సంవత్సరాల క్రితమే అంకురార్ప‌ణ జ‌రిగింద‌న్నారు. రూ.400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే సమయంలో ఏకంగా 4వేలకుపైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుండటం.

ఎందుకు నిర్మించారు ?  

2015లో గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్‌ మొదటి దశ నిర్మించారు. దానికి
అనూహ్య స్పందన లభించింది. దీంతో మరింత భారీగా టీ–హబ్‌ రెండో దశ (టీ–హబ్‌ 2.0)ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. ఇది తొలిదశ టీ–హబ్‌ తో పోలిస్తే ఐదు రెట్లు పెద్ద టెక్ ఇంక్యుబేటర్. టీ–హబ్‌ మొదటిదశలో ప్రాథమిక స్థాయి వసతులే అందుబాటులో ఉండగా.. తాజాగా రెండో దశలో అత్యాధునిక వసతులను కూడా జోడించారు.

‘శాండ్‌ విచ్‌’ నమూనాలో డిజైన్‌..

‘స్పేసెస్‌’ అనే కొరియన్‌ సంస్థ టీ–హబ్‌ రెండో దశ భవనాన్ని అత్యంత సృజనాత్మకంగా ‘శాండ్‌ విచ్‌’ నమూనాలో డిజైన్‌ చేసింది. పది అంతస్తుల్లో టీ–హబ్‌ రెండో దశ నిర్మాణం కాగా.. ప్రస్తుతం ఐదు అంతస్తుల్లో కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ ఏడాది చివరలోగా అదనంగా నెలకో అంతస్తు చొప్పున వినియోగంలోకి తేనున్నారు. ఇందులో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకునే వెంచర్‌ క్యాపిటలిస్టులు, స్టార్టప్‌లు, ఇతర సంస్థలను ప్రత్యేక నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది. స్టార్టప్‌ సంస్కృతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో టీ–హబ్‌ రీజినల్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఎవరెవరికి అవకాశం ?

* వ్యక్తిగతంగా లేదా ఒక చిన్న బృందంగా ఏర్పడి సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చే వారికి.. వారి ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన అన్ని హంగులు టీ–హబ్‌ 2లో అందుబాటులో ఉంటాయి.
* ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్‌ స్పేస్‌ లభిస్తుంది.
* టీ–హబ్‌ మొదటి అంతస్తును వెంచర్‌ క్యాపిటలిస్టుల ఆఫీసుల కోసం పూర్తి ఉచితంగా కేటాయిస్తారు.ఇప్పటివరకు రెండు వీసీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.

ఇందులోకి తరలించేవి..

* ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ను ఇక్కడికి తరలిస్తారు.
* ‘సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’, హైదరాబాద్‌లో సీఐఐ ఏర్పాటు చేయనున్న ‘సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌’కు కార్యాలయ వసతి కల్పిస్తారు.
* కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్‌ ఇండియా’ స్టేట్‌ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి.
* ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్‌ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్‌లను వెంటనే కొత్త ప్రాంగణంలోకి తరలిస్తారు.

CM Sri KCR inaugurated @THubHyd Phase 2 facility in Hyderabad today. Minister Sri @KTRTRS, CS Sri @SomeshKumarIAS, Principal Secretary Sri @Jayesh_Ranjan, T-Hub Board of Directors and dignitaries from innovation ecosystem were present. #InnovateWithTHub #HappeningHyderabad pic.twitter.com/PTMrRjcQHZ

— Telangana CMO (@TelanganaCMO) June 28, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • hyderabad start up
  • ktr
  • T Hub 2.0

Related News

Phone Tapping Santhosh

ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేశారు? అనే విషయాలపై స్పష్టత కోసం వీరిని ప్రశ్నిస్తున్నారు

    Latest News

    • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

    • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

    • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

    • Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

    • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd