HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Ca Kcr National Party Announcement Postponed For Another Two Months

CM KCR : కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పట్లో లేనట్లేనా? ఇంతలోనే ఏమైంది?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్...గత కొన్నాళ్లుగా అదే పనిలో బిజీగా ఉన్నారు.

  • Author : hashtagu Date : 22-09-2022 - 9:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr
Cm Kcr

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్…గత కొన్నాళ్లుగా అదే పనిలో బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది నాయకులతో చర్చలు జరిపారు. బీజేపీ వ్యతిరేక శక్తులనంతా ఏకం చేయాలన్న ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. త్వరలోనే జాతీయ పార్టీని కూడా పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ ఇప్పట్లో కొత్త పార్టీ ప్రకటన లేనట్లేనని పార్టీ నేతలు అంటున్నారు. అన్నీ కుదిరితే దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగినప్పటికీ…ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మాత్రం…దసరాకు కొత్త పార్టీ ఏర్పాటు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ పార్టీ ప్రకటన ముహూర్తం మారినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దసరాకు కాకుండా మరో రెండు నెలల తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఇక జాతీయ పార్టీకి సంబంధించిన జెండా, ఎజెండా, విధి విధానాలపై కేసీఆర్ తీవ్రంగానే శ్రమిస్తున్నారు. దాని కోసం ప్రత్యేకంగా నిపుణులను ఏర్పాటు చేసిన నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయంపై ఈసీతో చర్చలు జరిపి…దసరాకు పార్టీ ప్రకటించాలని అనుకున్నారు కేసీఆర్. కానీ ఏర్పాట్లు తుది దశకు రాకపోవడంతో…డిసెంబర్లో ప్రకటించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇంకా షురూ కాలేదట. ఇక కొత్త పార్టీని ప్రకటించిన తర్వాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ మరింత దూకుడుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. రైతు ఎజెండాతోనే జాతీయ రాజకీయాల్లో వెళ్లాలని భావిస్తున్నారు. మొత్తానికి దసరాకు పార్టీని ప్రకటిస్తారనుకున్న టీఆరెస్ వర్గాలు..ఇప్పుడా ప్రకటన రెండు నెలలకు వాయిదా పడటంతో…కొంత నిరుత్సాహానికి లోనవుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • telangana
  • ts politics

Related News

Amit Shah makes key remarks on alliances in Telangana.

Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బ

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Mahender Makhijani: అమెరికాలో బ్యాంకు మోసం ఏకంగా రూ. 950 కోట్లు.. భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్‌

  • ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం

  • AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్‌ కెసిరెడ్డి అరెస్ట్​

  • ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భార‌త నావికులు మృతి

  • Mamata Banerjee: దీదీ కి భారీ షాక్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd