HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Bjp Purge Brs Leaders In Full Josh Do You Know Why

BJP and BJP: కమలం పార్టీలో కుదుపులు.. బీఆర్ఎస్ నేతల్లో ఫుల్ జోష్!

బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు చేసిన విషయం తెలిసిందే.

  • Author : Balu J Date : 05-07-2023 - 3:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Political
Political

బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు చేసిన విషయం తెలిసిందే. బండి స్థానంలో కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. అయితే బీజేపీలో జరిగిన డెవలప్మెంట్లు కేసీయార్ కు కచ్చితంగా అనుకూలంగానే ఉంటుందని అర్ధమవుతోంది. ఇంతకీ జరిగింది ఏమిటంటే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బండ సంజయ్ ను తీసేసి సడెన్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. ఈ డెవలప్మెంట్ కేసీయార్ కు బాగా అనుకూలించేదనే చెప్పాలి. ఎలాగంటే అధ్యక్షుడి ఉన్నపుడు బండి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శించేవారు. ప్రతి విషయంలోను కేసీయార్ లేదా ఆయన కుటుంబాన్ని పిక్చర్లోకి లాగి రాచి రంపాన పెట్టేవారు.

మర్యాద, హుందాతనం అన్నది బండి మాటల్లో పెద్దగా వినబడేదికాదు. పక్కా మస్ మసాలా మాటలు, డైలాగులు ఉపయోగించేవారు. చాలాసార్లు బండి మాటలు అన్నీ హద్దులను దాటేసేవారు. దాంతో బండి ఉపయోగించిన భాషపై చాలా రాద్దాంతమే జరిగింది. ఇక కిషన్ విషయం చూస్తే బండిలాగ మాస్ మసాలా భాషను ఉపయోగించలేరు. ప్రత్యర్ధులపై కౌంటర్లు గట్టిగానే వేస్తారు, ధాటిగా పాయింట్ బై పాయిట్ మాట్లాడుతారు. అయితే ఒకస్ధాయికి దిగిపోయి కిషన్ మాట్లాడలేరు.

ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఇక్కడే బండికి, కిషన్ కి మధ్య తేడా స్పష్టంగా బయటపడుతుంది. అందుకనే కేసీయార్, ఆయన కుటుంబంపై కిషన్ మాట్లాడే మాటలు, విసిరే పంచులు పెద్దగా ప్రభావం చూపవనే ప్రచారం మొదలైపోయింది. ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో కిషన్ వేసే పంచులు గట్టిగా ఉండకపోతే ప్రత్యర్ధులపై ఎలాంటి ప్రభావం కూడా చూపవు. బండి సంజయ్ ను తప్పించడంతో బీజేపీకే పెద్ద లాస్ అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కిషన్ రెడ్డి, కేసీఆర్ మధ్య మంచి ర్యాపో ఉందంటూ ఇప్పటికే టీ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తు్నారు.  ఇక ఈ అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని నిరూపించేందుకు మాస్టర్ స్కెచ్ వేసింది. తాజా పరిణామాలు, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోగా, కాంగ్రెస్ ఊహించనివిధంగా పుంజుకుంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే మాదిరిగా రంగంలో దిగబోతోంది.

Also Read: Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇక సినిమాలకు బ్రేక్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • BRS Leaders
  • brs party
  • kishan reddy

Related News

Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

ధైర్యవంతమైన మరియు నిర్ణయాత్మక నాయకత్వంతో, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, KTRను మరియు మొత్తం BRSను ఇబ్బందుల్లో పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని భావించి సవాలు విసిరిన అహంకారి KTR, ఇప్పుడు తప్పించుకునే మార్గాల కోసం నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీలో గంభీరమైన చర్చకు బదులు

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd