Bandi On KCR: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ ఛాలెంజ్!
నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్‌లోని సూరారంలో సభ నిర్వహిస్తున్నారు.
- By Balu J Published Date - 05:22 PM, Mon - 12 September 22

నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్‌లోని సూరారంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సభకు వస్తున్న భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంయ్‌కి భారీ తులసి మాలతో స్వాగతం పలికారు. మహిళలు ఆయనకు మంగళహారతులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. విద్యుత్ సంస్కరణ బిల్లులో మోటర్లకు మీటర్లు పెడతామని రాసి ఉంటే తాను రాజీనామా చేస్తానని…లేదంటే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలనపై అసెంబ్లీ వేదికగా కేసీఆర్ రెచ్చిపోయారు. ఎనిమిదేళ్లుగా దేశాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. అంతేకాదు, 12లక్షల కోట్లు సుమారుగా కార్పొరేట్ కంపెనీలకు రైటాఫ్ చేసిన కేంద్ర సర్కార్ రైతులకు అన్యాయం చేస్తోందని ఆవేదన చెందారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని దుర్మార్గంగా ముందుకు మోడీ సర్కార్ వెళుతోందని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ లెక్కల్ని బయటపెట్టారు. నిరంతరం విద్యుత్ ను ఇస్తోన్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని విద్యుత్ బకాయిల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతోందని కేసీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ బండి సంజయ్ పై విధంగా రియాక్ట్ అయ్యారు.
Live : Public Meeting from Qutubullapur constituency ahead of #PrajaSangramaYatra4. https://t.co/qTHo9XCBQb
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 12, 2022